03/26/19 9:01 PM

మరోసారి వైసీపీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

pawan kalyan targets ys jagan again

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన సై అంటే సై అంటున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంది. అయితే నాకేం తక్కువ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటు విమర్శలతో చాలెంజ్ చేస్తున్నారు. కాగా, అధికార పక్షం టీడీపీ, సీఎం చంద్రబాబు కన్నా.. ఎక్కువగా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తుంటడం విశేషం. కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఇప్పటికే పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

 

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్… వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. వాళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులా లేక బెట్టింగ్ రాయుళ్లా అని కామెంట్ చేశారు. శ్రీధర్ రెడ్డి, అనిల్ యాదవ్ ప్రతి విషయంపై బెట్టింగ్‌లు బెడుతుంటారని ఆరోపించారు. అసలు వారికి ఎమ్మెల్యే టికెట్లు ఎందుకని ప్రశ్నించిన పవన్… వాళ్లు క్లబ్‌లో కూర్చుని పేకాట ఆడుకోవాలని అన్నారు.

 

నెల్లూరు జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు బెట్టింగుల్లో ఆరితేరిపోయారని పవన్ విమర్శించారు. క్రికెట్ బెట్టింగులకు తోడు ఎక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతాది అన్నదానిపైనా బెట్టింగులు కడుతున్నారని, వీళ్లకెందుకు రాజకీయాలని పవన్ నిలదీశారు. బెట్టింగ్ లు అడ్డుకుంటున్న పోలీసులపైనా దాడులు చేసే స్థితికి రావడం ఆందోళనకరమన్నారు.

 

నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌పై పవన్ మండిపడ్డారు. ‘అనిల్ కుమార్ యాదవ్ నా అభిమాని చెప్పుకుంటాడు. గతంలో రెండుమూడు సార్లు కలిశాడు. నువ్వు బెట్టింగ్ లు మానేసి అప్పుడు నా అభిమానినని చెప్పుకో’ అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తాను పవన్‌కు అభిమానినని చెప్పిన అనిల్.. ఇటీవల ఆయనపై మండిపడుతున్నారు. పవన్ అభిమానిగా ఉన్నందుకు సిగ్గుగా ఉందంటూ విమర్శించారు. దీనికి కౌంటర్‌గానే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

 

పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా ? అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కొందరికి పేకాట క్లబ్‌లతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితం పోలీసులను బెదిరించారనే ఆరోపణల కారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు.. టీఆర్ఎస్‌తో వైసీపీ లాలూచీ పడిందని ఇటీవల విమర్శించిన పవన్ కళ్యాణ్… తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్, చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం ఉందని.. అందుకే చంద్రబాబుని వదిలేసి జగన్ పై పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags : anil kumar yadavbettingchandrababujanasenakovurnellorepawan kalyanys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu