01/12/19 7:33 PM

కాబోయే సీఎం చంద్రబాబే అంటున్న బాబు

Actor Jagapati Babu Hot Comments On AP CM

ఏపీలో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరు? కాబోయే సీఎం ఎవరు? తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. ఎన్నికలు జరగాలి, ఫలితాలు రావాలి. కానీ ఎలక్షన్స్ జరక్కముందే కొందరు కాబోయే సీఎం ఎవరో చెప్పేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎవరో గెస్ చేస్తున్నారు. ఏపీకి కాబోయే సీఎంపై సినీ నటుడు జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని జగపతి బాబు అన్నారు. అంతేకాదు నవ్యాంధ్రప్రదేశ్ అనే పసిపాప చంద్రబాబు చేతుల్లో సురక్షితంగా పెరుగుతోందని ప్రశంసించారు కూడా. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆకాంక్షించారు.

 

గుంటూరు జిల్లా ఖాజా వద్ద సాహితీ వాగ్దేవి ఐటీ పార్క్‌ ఏర్పాటు కాబోతోంది. దీని నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనీనటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ… చంద్రబాబు పాలనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అండగా నిలిచేందుకే అమరావతి ప్రాంతంలో ఐటీ పార్క్ నిర్మాణం జరుగుతోందని.. సీఎం ఐటీని బాగా ప్రోత్సహిస్తున్నారని జగపతిబాబు కామెంట్ చేశారు. చంద్రబాబుతో సీఎంలా కాకుండా స్నేహితుడితో మాట్లాడిన ఫీలింగ్ తనకి కలుగుతుందన్నారు జగపతి బాబు. తన మాటకి ఎంతో విలువ ఇచ్చి కార్యక్రమానికి వచ్చారని, దీన్ని జీవితాంతం గుర్తు ఉంచుకుంటానని జగపతి బాబు అన్నారు. చంద్రబాబు విజన్ చాలా గొప్పదని అన్న జగపతి బాబు.. చంద్రబాబు మళ్లీ గెలిచేశారు, సీఎం అయ్యిపోయారు అనే ఫీలింగ్‌ తనకు కలిగిందన్నారు.

 

నటి రమ్యకృష్ణ కూడా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యమంత్రి కృషితో అమరావతి రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చారు. చంద్రబాబు శ్రమవల్లే రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంతటి అభివృద్ధి జరిగిందని రమ్యకృష్ణ అన్నారు.

 

చేతిలో డబ్బు లేకపోయినా ఆలోచనలతోనే అమరావతి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీని బాగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. త్వరలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలబడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మరి జగపతిబాబు అన్నట్టు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఇక మ్యాటర్‌కు వస్తే చంద్రబాబు శంకుస్థాపన చేసిన టెక్నో పార్క్‌కు జగపతిబాబు పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

Tags : amaravatiap cmap next cm chandrababuchandrababuJagapatibaburamya krishna

Also read

Use Facebook to Comment on this Post



Menu