06/30/19 7:38 PM

టార్గెట్ టీడీపీ : చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చిన సీఎం జగన్

Another Big Shock For Chandrababu

ఏపీ సీఎం జగన్.. మాజీ సీఎం చంద్రబాబుని వెంటాడుతున్నారు. చంద్రబాబు టార్గెట్ గా స్కెచ్ వేస్తున్నారు. అక్రమకట్టడాల పేరుతో చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమకట్టడం అని తేల్చి కూల్చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి కూల్చివేత నోటీసులు ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఇల్లు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఆఫీస్ లను సీఎం జగన్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

 

మాజీ సీఎం చంద్రబాబుకి సీఎం జగన్ మరో గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు విజయవాడలోని కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమకట్టడాలకు కూల్చివేత నోటీసులు ఇవ్వగా.. తాజాగా నోటీసుల పర్వం విశాఖ నగరాన్ని తాకింది. అది కూడా టీడీపీ ఆఫీస్ ని టార్గెట్ చేశారు. విశాఖలోని టీడీపీ ఆఫీస్ కి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) అధికారులు కూల్చివేత నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారంటూ అధికారులు నోటీసులిచ్చారు. భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, యాజమాన్య పత్రాలను సమర్పించలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చామన్నారు. మరోవైపు… ప్రభుత్వ స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మించారనే ఆరోపణలతో.. జీవీఎంసీ నోటీసులివ్వడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల్లో స్పందించకపోతే భవనాన్ని కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

 

జగన్ సీఎం అయ్యాక అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ముందుగా అక్రమకట్టడాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసం పక్కనే నిర్మించిన ప్రజావేదిక అక్రమకట్టడం అని చెబుతూ.. దాన్ని కూల్చేశారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా కంటిన్యూ అవుతున్నాయి. కాగా, ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యలు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు మాత్రం అలాంటిదేమీ లేదని అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని చెబుతున్నారు.

Tags : ap cm ys jaganchandrababudemolitiongvmcillegalnoticespraja vedikaSHOCKTDPtdp- officeVISAKHA

Also read

Use Facebook to Comment on this Post



Menu