06/12/19 9:09 PM

జనసేనాని పవన్ కళ్యాణ్ కి మరో గట్టి షాక్ తప్పదా?

Another Big Shock For Pawan Kalyan

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఫలితాలు చూసిన జనసేనాని పవన్ కల్యాణ్ కి మరో గట్టి షాక్ తప్పేలా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్.. జనసేనను వీడి బీజేపీలో చేరారు. పోతూపోతూ ఆయన జనసేనానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని నడపడంలో పవన్ ఫెయిల్ అయ్యారని తేల్చారు. రావెల చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణులను విస్మయానికి గురి చేశాయి. ఇది మరువకముందే జనసేనకు మరో గట్టి దెబ్బ తగిలేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. కాగా, జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

దీనికి కారణం లేకపోలేదు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రాపాక వరప్రసాద్.. ఆ వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఛాంబర్ కి వెళ్లి కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. కొద్దిసేపు మాట్లాడారు. జగన్ తో ఏం మాట్లాడారో తెలియదు కానీ.. బయటకు వచ్చిన వరప్రసాద్.. జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు.

 

సీఎం జగన్ తో రాపాక వరప్రసాద్ రావు భేటీ కావడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వైసీపీలో చేరతారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాపాక సైతం పార్టీ మారుతారని పుకార్లు షికార్లు చేశాయి. వైసీపీలోకి వెళ్లిపోతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు జగన్ ను రాపాక కలవడం.. ఆ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే తాను జనసేనలోనే ఉంటానని వరప్రసాద్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇప్పటికి ఇలా అన్నా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags : janasenapawan kalyanrapaka varaprasa raoYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu