02/7/19 9:17 PM

జగనన్న ఏమిటి : నిప్పులు చెరిగిన చంద్రబాబు

AP CM Chandrababu Fires On Jagan Anna

ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహలు రచిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అన్న వస్తున్నాడని చెప్పండి.. అని జగన్ అంటే.. జగన్ అన్న ఏంటి? చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. జగన్.. ‘అన్న పిలుపు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే అన్న వస్తున్నాడని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

 

ఆర్థిక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌ను రాష్ట్రంలోని ఏ మహిళా అన్నగా అంగీకరించదని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌కు ఓ నేరస్థుడు ఎలా ఉంటాడో తెలుసే తప్ప, అన్నగా ఎలా ఉండాలన్న సంగతి తెలియదని అన్నారు. అసలు.. అన్నగా ఎలా ఉండాలో జగన్ కు తెలుసా? అని ప్రశ్నించిన చంద్రబాబు, తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని దగ్గర చేసిందని చెప్పారు. ప్రతిపక్షం ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని, వారు ఎన్ని ప్రకటనలు చేసినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మహిళలకు ఇచ్చిన ‘పసుపు కుంకుమ’ చెక్కులను పంచేసి ఊరుకోకుండా, వాటిని బ్యాంకులో వేయించి, డబ్బులు తీసుకునేంత వరకూ కార్యకర్తలు బాధ్యత వహించాలని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్సైలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారని.. వైసీపీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారని, వీరి వ్యవహరంపై నిఘా పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

 

రాజకీయ పార్టీకి చెందని ఓటర్లను టార్గెట్ చేసుకుంటూ, వారికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు. ఇందులో భాగంగా అన్న పిలుపు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పలువురితో భేటీ అవుతున్నారు. ప్రభుత్వం ఎలా పని చేయాలో సూచిస్తే, తాను దానిని ఆచరణలో పెట్టి చూపిస్తానని తటస్థుల భేటీలో జగన్ చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాన్ని గమనిస్తున్నానని, తమ ప్రభుత్వం వచ్చాక అంతా మంచి జరుగుతుందని వారికి భరోసా ఇస్తున్నారు.

Tags : anna pilupuanna vastunnaduap cm chandrababucm fires on jaganTDPYs jagan mohan reddyysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu