02/22/18 3:56 PM

నేను ప్యాకేజీకి ఒప్పుకోవడానికి కారణమిదే..!

Untitled-1 copy

ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాకు సమాధి కట్టారని, తన ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్యాకేజీకి అంగీకరించడానికి గల కారణాలను వివరించారు.

 

ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నామని చంద్రబాబు చెప్పారు. కాగా, విభజన హామీల అమలుకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని ఆయన తేల్చి చెప్పారు.

 

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేంద్రంపై పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 

గత నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

Tags : anantapurap cm chandrababu naiduBJPkia plantmodiSPECIAL PACKAGEspecial statusTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu