02/23/18 9:14 PM

మోదీపై స్వరం పెంచిన చంద్రబాబు..!

Untitled-1 copy

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంపై స్వరం పెంచుతున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీల కోసం తాను ఎంతో పోరాడానని, లాభం లేకనే ఇప్పుడు గట్టిగా అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే… తాము పోరాట పంథాను ఎంచుకున్నామని తెలిపారు.

 

కష్టాలు ఉన్నాయని, కేంద్రం హామీలను అమలు చేసి సహకరించడం లేదని చంద్రబాబు వాపోయారు. ప్రత్యేక హోదా – విభజన హామీలు మన హక్కు అని చంద్రబాబు అన్నారు. వాటిని అమలు చేయడం కేంద్రం బాధ్యత అని చెప్పారు. మనం విభజన హామీల కోసం ఓ వైపు పోరాడుతూనే మరోవైపు కష్టపడి పని చేసి అభివృద్ధికి పాటుపడదామని సీఎం అన్నారు.  విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ సాధించేవరకు విశ్రమించబోమని, ఇందులో రెండో ఆలోచన లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏపీ ఈ-ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఈ నెల 27వ తేదీకి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు.  తన రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే, అభివృద్ధిలో దూసుకెళుతున్నామని చెప్పారు. ఐదు నదులను అనుసంధానం చేసి, మహా సంగమాన్ని ఏర్పాటు చేస్తామని… ఇది సాకారమైతే రాష్ట్రంలో కరవు అనేది ఉండదని ఆయన అన్నారు. ఏపీలో ఈ-ప్రగతి అకాడమిని నెలకొల్పుతామని, ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చి దిద్దుతామని సీఎం చెప్పారు.

Tags : andhra pradeshap cm chandrababu naiduBJPmodispecial statusTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu