05/22/19 9:22 PM

సీఎం జగన్ అంటూ అమరావతిలో అప్పుడే వెలిసిన బ్యానర్లు

AP CM YS Jagan Mohan Reddy Banner

ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. గెలిచేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. టీడీపీ అధికారం నిలబెట్టుకుంటుందా? వైసీపీ అధికారంలోకి వస్తుందా? కాబోయే సీఎం చంద్రబాబా? జగనా? అనేది హాట్ టాపిక్ గా మారింది. మే 23వ తేదీన ఉదయం ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఎవరిది పైచేయి అనే విషయం తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. విజయంపై అటు టీడీపీ, ఇటు వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో టీడీపీతో పోలిస్తే వైసీపీ నాయకులు మరికొంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు సమయం ఉన్నా, వైసీపీ నేతలు అప్పుడే హడావుడి చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో వైసీపీ నాయకులు ఉత్సాహం ఆపుకోలేకపోతున్నారు. విజయం తమదేనని ధీమాతో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ సీఎం కావడం ఖాయం అంటూ సందడి చేస్తున్నారు.

 

అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంటూ అప్పుడే బ్యానర్లు కూడా ముద్రించేశారు. ఫ్లెక్సీలు కూడా చేయించారు. రాజధాని అమరావతిలో జగన్ నివాసం దగ్గర కనిపించిన ఓ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. పెద్దాపురం వైసీపీ నేత దవులూరి దొరబాబు ఈ బ్యానర్ ను చేయించారు. తాడేపల్లి, కడప తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో థంబ్‌నెయిల్స్, పోస్టులు, ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి.

 

దొరబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం సీటు ఆశించి నిరాశకు గురయ్యారు. అయినా, జగన్ పై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇలా ప్రయత్నించారు. సోషల్ మీడియాలో ఈ బ్యానర్ విపరీతంగా సందడి చేస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా అమరావతిలోని తాడేపల్లి సమీపంలోని తన నివాసానికి చేరుకోనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ అమరావతి వచ్చారని తెలుసుకున్న వైసీపీ నేతలు… ఒక్కొక్కరిగా తాడేపల్లికి క్యూ కడుతున్నారు. దీంతో తాడేపల్లిలోని జగన్ కొత్త ఇల్లు పరిసరాలు వైసీపీ బ్యానర్లతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన దొరబాబు ఏకంగా జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్టు బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆసక్తిరేపుతోంది.

YSR Congress fans advance celebration

వైసీపీ గెలవకముందే ఆ పార్టీ నేత ఈ రకమైన బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని కొందరు సమర్థిస్తే మరి కొందరు తప్పు పడుతున్నారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదేమో అంటున్నారు. అదే సమయంలో.. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వే సంస్థలు.. ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అని ప్రకటించాయి. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో విపక్ష వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పాయి. వైపీపీకి 100కి పైగా సీట్లు వస్తాయని, కాబోయే సీఎం జగన్ అని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టే మే 23వ తేదీన కూడా జరుగుతుందని, వైసీపీ నేతలు ఇలా చేయడం తప్పేమీ కాదనే వారూ లేకపోలేదు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమాతో కొందరు అభిమానులు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంటూ నేమ్ ప్లేట్ ను కూడా తయారు చేయించిన సంగతి తెలిసిందే.

Tags : amaravatiAp cm ys jagan mohan reddyap elections 2019bannerysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu