04/15/19 11:58 AM

ఇదే నిజమవుతుందా? వైరల్‌గా మారిన ”వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి” నేమ్ ప్లేట్

AP CM YS JAGAN MOHAN REDDY, NAME PLATE VIRAL

ఏపీలో పోలింగ్ ముగిసింది. 80శాతం పోలింగ్ నమోదైంది. అనూహ్యంగా ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది చర్చనీయాంశంగా మారింది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ చెప్పుకుంటున్నాయి. అధికారం మాదే అని ఇరు పార్టీల నాయకులు పోటీలు పడి చెప్పుకుంటున్నారు. తమ పార్టీకి 130 సీట్లు ఖాయం అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఓటర్ తీర్పు ఏమిటన్నది మే 23వ తేదీన తెలియనుంది.

 

ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణుల్లో ఆనందం నింపితే.. పిచ్చికి పరాకాష్ట అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇంతకీ అదేంటో చెప్పలేదు కదూ.. అదే..జగన్ నేమ్ ప్లేట్. వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి… అనే నేమ్ ప్లేట్ ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు.. అని తెలుగులో.. YS JAGAN MOHAN REDDY.. HONORABLE CHIEF MINISTER అని ఇంగ్లీష్ లో రాసి ఉన్న నేమ్ ప్లేట్ సెన్సేషన్ ల్ గా మారింది.

 

ఈ నేమ్ ప్లేట్ ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? అన్నది తెలియదు. కానీ సంచలనం అయితే అయ్యింది. జగన్ అభిమానులు లేదా సన్నిహితులు ఈ నేమ్ ప్లేట్ చేయించి సోషల్ మీడియాలో పెట్టి ఉంటారని అనుకుంటున్నారు. కాగా ఇది ఇప్పుడు చేసింది కాదని, 2014 ఎన్నికల సమయంలోనే చేసిందని.. అప్పుడు తృటిలో జగన్ సీఎం పదవిని కోల్పోయారని, ఈసారి మాత్రం ముఖ్యమంత్రి అవడం ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

 

ఓ వైపు చంద్రబాబు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే.. మరోవైపు జగన్ కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసేశారు. ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ ముందు నుంచి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకు ‘కౌంట్ డౌన్’ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది. అయితే, కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ బోర్డు కూడా రెడీ అవడం విశేషం.

 

ఈ నేమ్ ప్లేట్ పై టీడీపీ నాయకులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జగన్ అధికార దాహానికి, జగన్ పిచ్చికి ఇది పరాకష్ట అని మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ గెలుపు ఖాయమని.. కాబోయే సీఎం చంద్రబాబే అని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. జగన్.. అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ట అని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇలాంటి నేమ్ ప్లేట్లు చేయించి… పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోందని విమర్శించారు. ప్రతిపక్షనేత బాధ్యతను జగన్‌ పూర్తిగా విస్మరించారని, ఈసారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని దేవినేని ఉమ అన్నారు. ప్రమాణస్వీకారం తేదీని దేవుడు నిర్ణయిస్తాడని జగన్ చెప్పడం.. ఓటమిని అంగీకరించడమే అని దేవినేని ఉమ అన్నారు.

Tags : ap cm chandrababuap cm jaganap electionsdevineni umaname plateviralYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu