05/17/19 12:06 PM

ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్

Big Set For Prabhas Movie

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే, మరో వైపు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా కానిచ్చేస్తున్నాడు. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.

 

చూస్తుంటే.. ప్రభాస్ ఇకపై తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసేలా లేడనేది అర్థమవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. దీనితో ప్రభాస్ తో సినిమాలు చేయాలనుకునే దర్శకులు భారీ స్థాయిలో ఉండే కథలనే సిద్ధం చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

 

హైదరాబాద్ నగర శివారులో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం నిర్మాతలు దాదాపు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తునట్లు సమాచారం. కేవలం ఒక్క సెట్ కోసమే ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాలి. 1960 కాలం నాటి పరిస్థితుల్లో యూరప్ లో ఎక్కువభాగం ఈ చిత్రం ఉంటుంది. ముందుగా ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేద్దామని భావించారు. అయితే భారీ ఖర్చుతో కూడుకున్న పని. దాంతో హైదరాబాద్ లోనే అవసరమైన సెట్ నిర్మించుకుని అందులో షూటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. విదేశాల్లో ఉన్నట్లు ఫీలింగ్ కలిగే అద్భుతమైన ఈ సెట్ పై ఆర్ట్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను యూరప్ లో కొంతవరకూ చిత్రీకరించారు. ఇకపై అక్కడ చేయవలసిన సన్నివేశాలను హైదరాబాద్ లోనే చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా, ‘సాహో’ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సాహో షూటింగ్ చివరి దశలో ఉంది. సాహో షూటింగ్ పూర్తి కాగానే రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్ర షూటింగ్ ఏకధాటిగా జరగనుందని సమాచారం.

Tags : big sethyderabadprabhasRadha krishnasaahoshooting

Also read

Use Facebook to Comment on this Post



Menu