06/17/19 12:22 PM

చంద్రబాబుకి షాక్ ఇవ్వబోయే ఆ 8మంది ఎమ్మెల్యేలు ఎవరు?

Big Shock For Chandrababu, TDP MLAs To Join YSRCP

ఏపీ ఎన్నికల్లో ఘోర ఫలితాలు చూసిన టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో భారీ షాక్ తగలనుందా? ఎమ్మెల్యేలు చంద్రబాబుకి గుడ్ బై చెబుతారా? టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోనుందా? ఏపీలో ఇక టీడీపీకి భవిష్యత్ లేదా? ఏపీలో త్వరలోనే ఉపఎన్నికలు రాబోతున్నాయా.. అంటే.. అవుననే అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టీడీపీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తనతో టచ్ లో ఉన్నారని కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇది నిజమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే అయితే.. టీడీపీని వీడే ఆ 8మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరు అనే డిస్కషన్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఇక తమకు భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన 8మంది ఎమ్మెల్యేలు త్వరలో వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారట. వీరితో పాటు కొందరు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని.. ఈ మేరకు నేతలంతా ఇప్పటికే జగన్ తో టచ్ లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. సభలో అప్పుడే రచ్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. తాను అనుకుంటే టీడీపీకి ప్రతిపక్షహోదా కూడా దక్కదని హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. మరోవైపు వైసీపీతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. తమతో 8 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. తనతో టచ్ లో ఉన్నవారి పేర్లు కూడా సీఎం జగన్ కి చెప్పానని అన్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి రావాలని తమ పార్టీ స్టాండ్ తీసుకుందన్నారు. చంద్రబాబుకి భవిష్యత్ లేదని, ఆయన మారరని టీడీపీ నేతలు భావిస్తున్నారని.. అందుకే వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కోటంరెడ్డి చెప్పారు.

 

కోటంరెడ్డి కామెంట్స్ ఏపీ రాజకీయాలతో పాటు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ఎమ్మెల్యేలు టీడీపీని వీడాలని అనుకుంటున్నది నిజమేనా? నిజమే అయితే ఆ 8మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ టాపిక్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపులు ఎంతమాత్రం ప్రోత్సహించేది లేదని అసెంబ్లీ వేదికగా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ చెప్పిన మాట ప్రకారం తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలంటే రాజీనామాలు చేసే రావాలి. అదే జరిగితే త్వరలోనే 8 చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయం అంటున్నారు. 8మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయం. ఏది ఏమైనా కోటంరెడ్డి ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

కోటంరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ తో టచ్ లో లేరని చెప్పారు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని ఎదురుదాడి చేశారు. శ్వాస ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటామని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి ఏది నిజమో ఏది అబద్దామో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags : defectionskotamreddy sridhar reddyTDPtdp mlasys jaganysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu