07/13/18 9:09 PM

మరో గెలుపు కోసం బీజేపీ బిగ్ స్కెచ్..!

Untitled-1 copy

2014 ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. మోదీ మానియాతో కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రేంజ్ లో సీట్లు గెలిచింది. ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో పది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇదీగాక, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో మోదీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలనాథులు ఇప్పటికే భారీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్టు సమాచారమ్.

 

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికులు రూపొందించినట్లుగా తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండు వందల ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని వంద లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 50కి పైగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు కూడా ఈ ర్యాలీల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

 

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి ర్యాలీ రెండు నుంచి మూడు లోక్ సభ స్థానాల మీదుగా ఉంటుందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించడానికి ముందే ఈ ర్యాలీలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈసీ ప్రకటనకు ముందు 400కు పైగా లోక్ సభ స్థానాలను కవర్ చేయాలని చూస్తున్నారు.

 

దేశవ్యాప్తంగా 400 లోక్ సభ స్థానాలను ప్రభావితం చేసేలా రెండు వందల వరకు ర్యాలీలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 50 ర్యాలీలలో ప్రధాని మోడీ పాల్గొంటారని, అవి వందకు పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తాయని, వాటితో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలోను ప్రధానమంత్రి పాల్గొంటారని చెబుతున్నారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం పంజాబ్‌ లోని మాలోత్ కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలకు ఇది తొలి అడుగు అని చెబుతున్నారు. ఇలాంటి రైతుల ర్యాలీనే ఉత్తర ప్రదేశ్‌లో ని షాజహాన్‌ పురలో ఈ నెలాఖరులో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

 

మొత్తంగా పార్టీ కార్యకర్తలను ఎన్నికల మూడ్‌ లోకి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీలు అని చెబుతున్నారు. అదే విధంగా ఈ నాలుగేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. తద్వారా విపక్షాల దుష్ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తిప్పికొట్టి, ప్రజలకు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

Tags : amit shahBJPbjp elections strategyelection campaignmodi big campaignmodi ralliespm modi

Also read

Use Facebook to Comment on this Post



Menu