09/21/18 9:45 PM

ఇద్దరు దొంగల్లో మంచిదొంగ అని ఓటేస్తే.. ఇప్పుడు గజదొంగయ్యారు

Untitled-1 copy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. ఆయనపై సెటైర్లు వేశారు. ఇద్దరు దొంగల్లో చంద్రబాబు మంచిదొంగ అని ప్రజలు ఓటేస్తే… ఇప్పుడు చంద్రబాబు గజదొంగ అయ్యారని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన కన్నా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మాబాద్‌ కోర్టు నోటీసులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. కోర్టును ప్రధాని ప్రభావితం చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35సార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని.. పైగా కోర్టులను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని కన్నా మండిపడ్డారు.

 

చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పాయారని విమర్శించారు కన్నా. చంద్రబాబు టెలీ ఫిల్మ్ వల్లే ఆ అమాయకులు చనిపోయారని.. ఈ ఘటనపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుబట్టారు. ఏపీ సీఎంకు దమ్ముంటే పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన.. విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని సవాల్‌ విసిరారు. అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు అవసరం కొద్ది పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు లక్ష్మీనారాయణ.

 

ఇక ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పరిజ్ఞానం లేదన్నారు కన్నా. ఏపీకి హోదాకు మించిన ప్రయోజనాలను బీజేపీ ఇచ్చిందని.. విభజన చట్టంలో ఉన్నవి, లేనవి కూడా అమలు చేశామన్నారు. దీనిపై అవగాహన లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

 

ఏపీలోని 175 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందన్న కన్నా.. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.

Tags : BJPcm chandrababuKanna lakshmi narayanamodiTDPys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu