08/12/18 3:55 PM

మిర్చిపై కూర్బోబెడతా.. ముఖ్యమంత్రికి బీజేపీ నేత వార్నింగ్..!

Untitled-1 copy

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును గుంటూరు మిర్చిపై కూర్చోబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మోసం, ద్రోహం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారాయన. ఇచ్చిన మాటపై నిలబడే పార్టీ బీజేపీ అని చెప్పిన మురళీధరరావు, ఏపీలో తమ పార్టీ నెంబర్ వన్ అవుతుందని జోష్యం చెప్పారు.

 

గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మురళీధరరావు.. ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కాగా, ఏపీకి ఇచ్చిన హమీలను  కేంద్రం 90 శాతానికిపైగా అమలు చేసిందని చెప్పుకొచ్చారు.

 

ఏపీకి ఎంత చేస్తున్నా మోదీ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలవుతున్నప్పటికీ మోదీ ఫొటో మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

Tags : ap cm chandrababuBJPguntur mirchimuralidhar raomuralidhar warns cmTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu