06/13/18 5:29 PM

జగన్ అవమానపరిచారు.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తాం..!

Untitled-1 copy

ప్రజాసంకల్ప యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ ముందుకు సాగిపోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. బ్రాహ్మణ సంఘాలు జగన్ పై ఫైర్ అవుతున్నాయి. మమ్మల్ని జగన్ అవమానించారు అంటూ బ్రాహ్మణులు ఆవేదనతో రగిలిపోతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.

 

వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలో బ్రాహ్మణ ఆత్మీయ సభ జరిగింది. దీనికి జగన్ రాకుండా తమను అవమానించారని ఏపీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తమ సభకు వస్తారనే భరోసాతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని… ఈ సభకు 13 జిల్లాల నుంచి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారని తెలిపారు. అయితే తమ సభకు వస్తానని చెప్పిన జగన్ ఆఖరి నిమిషంలో రాకుండా మోహం చాటేసి బ్రాహ్మణుల మనోభావాలను, ఆత్మాభిమానాన్ని జగన్ గాయపరిచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తమ సభకు వస్తారని, బ్రాహ్మణుల సమస్యలపై తన వైఖరి ప్రకటిస్తారని తాము ఆశించామని కానీ జగన్ సభకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తమకు జరిగిన అవమానానికి సంబంధించి రాజమండ్రిలోని ఓ హోటల్ లో బ్రాహ్మణ సంఘాల నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. జగన్ తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెండు రోజుల్లోగా వైసీపీ నేతలు స్పందించాలని, లేకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని కూడా చెప్పారు.

Tags : Brahmin communities angry on ys jaganBrahminsBrahmins warn ysrcpinsultrajahmundry

Also read

Use Facebook to Comment on this Post



Menu