Ad

03/15/18 7:26 PM

జగన్ ఊహించని విధంగా చంద్రబాబు సంచలన నిర్ణయం..!

Untitled-1 copy

ప్రత్యేక హోదా కేంద్రంగా ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పక్షం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఇరుకున పడేసింది. వివరాల్లోకి వెళితే.. కేంద్రప్రభుత్వంపై పార్లమెంటులో వైసీపీ ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయింది. అవిశ్వాసంపై వైసీపీకి.. టీడీపీ పూర్తిగా సహకరించనుంది. మంత్రులు, పార్టీ కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అవిశ్వాసంలో వైసీపీతో కలిసి ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

 

ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. కేంద్రప్రభుత్వంపై వైసీపీ అనుసరిస్తున్న ద్వంద విధానాలకు చెక్ పెట్టే విధంగా, అవిశ్వాసానికి మద్దతిచ్చి, వైసీపీని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు వ్యూహం రచించారనే వార్తలు వస్తున్నాయి.

 

వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి ఎందుకు మద్దతివ్వాలని కొందరు మంత్రులు ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశానికైనా మద్దతిచ్చేందుకు టీడీపీ రెడీగా ఉండాలని, మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీని ఇరుకున పెట్టడానికి, ప్రజల వద్ద తమ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి ఇదే సమయమని చంద్రబాబు సమాధానం ఇచ్చారట.

 

వైసీపీ అవిశ్వాసం నిజాయతీతో కూడినదైతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, స్వలాభం కోసమైతే అది ఆ పార్టీ విజ్ఞతకే వదిలేద్దామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. మోదీపై విశ్వాసం ఉందని చెబుతూనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంలో వైసీపీ ఉద్దేశం ఏదైనా.. తాము మాత్రం రాష్ట్రం తరపున ధర్మంగా మద్దతు తెలుదామని మంత్రులతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.

 

ఏపీ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తేల్చి చెప్పారు. తనపై విమర్శలు చేసే వ్యక్తులు ఆలోచించుకోవాలన్నారు. నన్ను బలపరచాలి తప్ప బలహీన పరిస్తే లాభం ఉండదన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు ప్రజలే హైకమాండ్ అన్న చంద్రబాబు.. ప్రజల కోసమే పని చేస్తామన్నారు. మనందరికి ప్రజల మనోభావాలు చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మనోధైర్యంతో ముందుకెళ్తామని చంద్రబాబు అన్నారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందంటూ ఎన్డీయే ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 21న అవిశ్వాసం పెట్టాలని గతంలోనే వైసీపీ నిర్ణయించినా.. పార్లమెంటు పరిస్థితుల దృష్ట్యా.. రేపే(16వ తేదీ, శుక్రవారం) ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలంటూ అన్ని పార్టీలకు వైసీపీ లేఖలు రాసింది.

 

కాగా.. వైసీపీ ఇచ్చిన అవిశ్వాసం, శుక్రవారం నాడు పార్లమెంట్ లో చర్చకు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. టీడీపీతో పాటు, కేంద్రంపై వ్యతిరేకత ఉన్న పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి అవిశ్వాసానికి మద్దతుగా నిలబడితే మాత్రం, దేశరాజకీయాలు ఆసక్తిగా మారడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, అవిశ్వాస తీర్మానం కనీసం చర్చకు వచ్చే అవకాశం కూడా లేదని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలను నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందుగానే వాయిదా వేసే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Tags : ap cm chandrababuBJPchandrababu support ys jaganndaNo confidence MotionTDPys jaganysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu