01/20/18 1:51 PM

బాలయ్యకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు !

Balakrishna

”ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  సినిమాలతో బిజీగా ఉంటూ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన సరిగ్గా పర్యవేక్షణ చేయని కారణంగా ప్రభుత్వ పథకాలు ప్రజలు సరిగ్గా చేరడం లేదు. దీంతో స్థానిక ప్రజల్లో ఆయనపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బాలయ్య మీద కో్పంతో తరచూ నియోజక వర్గంలో నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి.. ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ ఫ్లకార్టులు పట్టుకోవడం తరహా ప్రదర్శనల నుంచి.. ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని గేదెకు బాలయ్య పేరు రాసి అత్యంత ఘోరంగా బాలయ్యను అవమానించడం లాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న తీరు చూస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బాలయ్య ఇక్కడి నుంచి నెగ్గడం చాలా కష్టం..ముఖ్యంగా బాలయ్య పేరు చెప్పుకుని ఆయన సన్నిహితులు చేస్తున్న అరాచకాలు.. పార్టీ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ వారు పెడుతున్న గొడవలు టీడీపీ హార్డ్ కోర్‌ కార్యకర్తలకు కూడా చిరాకును తెప్పిస్తున్నాయి..”

 

ఇదీ.. హిందూపురంలో బాలయ్య ‘ఎక్స్‌ట్రార్డినరీ ఫెర్‌ఫార్మెన్స్‌’ గురించి ఇంచు మించు అటు ఇటుగా చంద్రబాబుకు వస్తున్న ఫిర్యాదుల సారాంశం. దీంతో ఈ వార్తలు నిజమేనని తన సన్నిహిత వర్గాల ద్వారా నిర్థారించుకున్న  చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో బాలయ్యను పోటీ నుంచి తప్పించాలని దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పలువురు టీడీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

 

బాలయ్య ను తప్పించి ఆ స్థానంలో తన తనయుడు లోకేష్ బాబును నిలబెట్టాలని చంద్రబాబు దాదాపు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఓ వ్యూహం ప్రకారమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనను తప్పించి బయటి వ్యక్తులు  ఎవరికైనా టికెట్‌ ఇస్తే బాలయ్య ..  దానిని అవమానంగా భావించి నానా రచ్చ.. గోల చేస్తాడని బాబు భావిస్తున్నారట.  అందుకే, ఎమ్మెల్సీగా లోకేష్ కు ఇంకా చాలా కాలపరిమితి ఉన్నప్పటికీ.. హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయనను నిలబెట్టాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.   లోకేష్ ను హిందూపురం నుంచి నిలబెడతానంటే  బాలయ్య మరో మాట మాట్లాడకుండా ఒప్పుకుంటారని చంద్రబాబు భావిస్తున్నారట. అల్లుడు లోకేష్ పేరు చెబితే కచ్చితంగా బాలయ్య తగ్గాల్సి వస్తుందని బాబు  తన అనుయాయుల దగ్గర ఇటీవల ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.  ఇక, అప్పటికీ బాలయ్య గొడవ చేస్తే  భవిష్యత్తులో రాజ్యసభకు పంపిస్తామని  సర్దిచెప్పి దారిలోకి తీసుకురావాలని ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Tags : Chandrababu disappointed with BalakrishnaHindupurnara lokeshTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu