04/27/19 9:01 PM

రాహుల్ గాంధీకి షాక్ : శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu Better Option For PM

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబే బెటర్ అని అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హత గలవారని ఆయన అన్నారు. ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ”మాయావతి, మమతా బెనర్జీ లేదంటే చంద్రబాబు.. ఎన్డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం’’ అని పవార్ తేల్చి చెప్పారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తాము ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

 

రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చాలా మంది మాట్లాడుతున్నారని, అది పూర్తిగా నిరాధారమైనది పవార్ అన్నారు. కాగా ప్రధానమంత్రి పదవిపై మాయావతి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీని గద్దె దించడమే తమ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదని మమత, చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని శరద్ పవార్ అన్నారు.

 

ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎన్నికల తర్వాత తమ కూటమిలోకి తీసుకొస్తామని పవార్ చెప్పారు. 2004 ఎన్నికల తర్వాత కూడా ఇదే జరిగిందని పవార్ గుర్తు చేశారు. అలా దేశానికి పదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించామని అన్నారు. దేశంలో మంచి నాయకులకు కొదవలేదన్న శరద్ పవార్… ఎన్నికల అనంతరం వాళ్లు ఎవరన్నది డిసైడ్ చేస్తామని అన్నారు. ఇప్పుడే ఎవరో ఒకరి పేరు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీయేతర పక్షాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి పని చేస్తాయని పవార్ చెప్పారు.

 

శరద్ పవార్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. పవార్ వ్యాఖ్యలు చూస్తుంటే.. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని పదవి రేస్ లో ఉన్నారనేది అర్థమవుతుంది. సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పోరాటం చేస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. దేశం కోసం, ప్రజాస్వామ పరిరక్షణ కోసం బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెబుతున్నారు.

Tags : ap cm chandrababubetter optionmamata banerjeemayawatimodiprime ministerrahul gandhisharad pawar

Also read

Use Facebook to Comment on this Post



Menu