05/17/18 8:37 PM

నారా లోకేష్ ను చూసి పుత్రోత్సాహంతో పొంగిపోతున్న చంద్రబాబు!

lokesh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్న వ్యక్తులకు ఈ అవార్డును ప్రకటిస్తారు.పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా కు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో టెక్నాలజీని వినియోగించుకుంటూ సాధించిన అత్యుత్తమ ఫలితాల ఆధారంగా నారా లోకేష్ కు ఈ అవార్డును ప్రకటించామని బిజెసెన్ వర్డల్డ్ పత్రిక స్పష్టం చేసింది. రేపు ఢిల్లీలో  దేశంలోని హేమాహేమీల సమక్షంలో జరగనున్న కార్యక్రమంలో నారా లోకేష్ ఈ  అవార్డును అందుకోనున్నారు.

 

మరో వైపు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపే నారా లోకేష్ కు ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల చంద్రబాబు  అత్యంత ఆనందంగా, గర్వంగా ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దేశంలో.. పరిపాలనకు సంబంధించిన అంశాల్లో టెక్నాలజీ యొక్క అవసరాన్ని గుర్తించి.. టెక్నాలజీని వాడటం మొదలుపెట్టిన  తొలి రాజకీయ నాయకుడు  తానేనని..  తనను చూసిన తర్వాతే దేశంలో మిగతా నాయకులు టెక్నాలజీ ఆవశ్యకతను గుర్తించారని చంద్రబాబు నిన్న తనను కలిసిన పార్టీ ప్రముఖల దగ్గర  వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాజాగా, తన బాటలోనే తన కుమారుడు కూడా వెళుతుండటం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. పాలనాపరమైన అంశాల్లో లోకేష్‌.. ముందు చూపు, చొరవ, దూకుడు చూస్తుంటే  భవిష్యత్తులో తనను మించిన నాయకుడు అవుతాడనే నమ్మకం తనకు ప్రగాఢంగా  ఉందని ఆయన తన పార్టీ నాయకుల దగ్గర లోకేష్ ను అభినందించారట. మరోవైపు, తమ యువరాజుకు ప్రతిష్టాత్మక అవార్డు తెలుగు తమ్ముళ్లు కూడా ఉత్సాహంతో పొంగిపోతున్నారు.

Tags : A.p cm chandrababu naiduAp minister nara lokeshBusiness worldchandrababu naidunara lokeshNara lokesh gets digital leader of the year award

Also read

Use Facebook to Comment on this Post



Menu