10/5/19 8:40 PM

సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని : చంద్రబాబు నోట భయంకరమైన బూతులు

Chandrababu Vulgar Words Controversy

ఏపీలో రాజకీయ వివాదాలకు అంతే లేదు. రోజుకో కాంట్రవర్సీ పుట్టుకొస్తోంది. ఓసారి అధికార పార్టీ నేతలు తప్పు చేసి అడ్డంగా బుక్కవుతుంటే..మరోసారి ప్రతిపక్ష నేతలు టంట్ స్లిప్ అవుతున్నారు. రాజకీయాల్లో కోపతాపాలు సహజం. విమర్శలు, ఆరోపణలు కామన్. కానీ.. ఏదైనా లిమిట్ లోనే ఉండాలి. అయితే మన నాయకులు హద్దులు దాటుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నామనేది మర్చిపోతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు. ప్రజల్లో చులకన అవుతున్నారు. వీళ్లా మన రాజకీయ నాయకులు? వీళ్లనా మనం గెలిపించింది? అని ప్రజలు సిగ్గు పడేలా చేస్తున్నారు. నాయకులు బూతులు మాట్లాడటం చాలాసార్లు జరిగింది. అయితే వారిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో సీనియర్ నేత, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. బూతు మాట అనడం చర్చకు దారితీసింది. చివరికి ఆయన కూడా దిగజారిపోయారా అని జనాలు ఆవేదన చెందుతున్నారు. మ్యాటర్ ఏంటంటే.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు సంచలనంగా మారాయి. ఆయన కావాలని అన్నారో లేక పొరపాటున నోరు జారారో కానీ.. బూతు మాట అనడం వివాదానికి దారితీసింది.

 

సోషల్ మీడియాలో వివాదం టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు పార్టీ ఆఫీసులో మీడియాను పిలిచి.. ఏకంగా మూడు గంటలపాటు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ నేతలపై పెడుతున్న సోషల్ మీడియా పోస్టులను చంద్రబాబు ప్రదర్శించారు. వైసీపీ నేతల తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బానే ఉంది.. కానీ అక్కడే ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. బూతు మాట అనేశారు.

 

చంద్రబాబు చూపిన పోస్టుల్లో ఒకటి టీడీపీ మహిళానేతలను ఉద్దేశించి పెట్టింది. అందులో బూతులు కూడా ఉన్నాయి. జగన్ అన్న ఏమైనా మీ ఆస్తి.. దెం….డా అంటూ ఒక బూతు ఉంది. సాధారణంగా మీడియా సమావేశంలో బూతులు మాట్లాడరు. అందులోనూ చంద్రబాబు వంటి స్థాయి ఉన్న నేత వాటిని పలకరు. కానీ చంద్రబాబు ఆ పోస్టును యథాతథంగా చదివి వినిపించారు. దీంతో అంతా షాకయ్యారు. టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనూ చంద్రబాబు నోట బూతు వచ్చేసింది. దీంతో టీవీలు చూస్తున్నవారు సైతం కంగుతిన్నారు. బాబుగారూ.. అంత మాట అనేశారేంటి? అని ఆశ్చర్యపోయారు.

 

దీన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. సోషల్‌ మీడియాలోని పోస్టింగ్‌లపై చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి అసభ్యకరమైన పదాలు చదువుతుంటే ప్రజలు చెవులు మూసుకుంటున్నారని కౌంటర్లు వేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పగా చెప్పుకునే బాబుగారు.. మహిళలను కించపరిచేలా ఉన్న పదాన్ని ఎలా పలికారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి చోటు దొరికిపోయి సిగ్గుతో తలదించుకుని ఇంట్లో కూర్చోకుండా ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి ఇంకా దిగజారిపోయాడన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లుందని, దయచేసి ఒకసారి డాక్టర్లకు చూపించుకోవాలని వైసీపీ నేతలు సూచించారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూడడం, కొడుకు చేతగానివాడు కావడం, వయస్సు మీద పడడంతో మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు.

 

చంద్రబాబుకి ఏదో అయ్యింది, అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. కాస్త విజ్ఞత ఉన్న వాళ్లు, సోషల్ మీడియా మీద అవగాహన ఉన్న వాళ్లు.. ఎవరూ ఇలాంటి బూతులను ప్రొజెక్ట్ చేసే పని పెట్టుకోరు అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ వెళ్లిందనే కామెంట్లు చేస్తున్నారు. హుందాతనానికి, సహనానికి చంద్రబాబుకి సాటిరారు అని టీడీపీ నాయకులు చెబుతారు. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారని, లిమిట్స్ క్రాస్ చేయరని బాబుగారికి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి.. ఇలాంటి పని చేయడం జనాలను, ప్రతిపక్షాలనే కాదు.. టీడీపీ నేతలనూ విస్మయానికి గురి చేసింది.

 

తమ పార్టీ మహిళా నేతలకు జరిగిన అవమానం గురించి చంద్రబాబు ప్రపంచానికి చెప్పుకోవడంలో తప్పు లేదు. ప్రత్యర్థులు పెట్టిన పోస్టులను చూపించడంలో తప్పు లేదు. కానీ.. లిమిట్స్ క్రాస్ చేసి.. బూతు మాట అనడమే ఇబ్బంది మారింది. ప్రత్యర్థులు చేసిన తప్పే చంద్రబాబు కూడా చేస్తే.. ఇక వారికి బాబుగారికి తేడా ఏముంటుంది అని జనాలు అడుగుతున్నారు.

Tags : chandrababucm jaganFacebook Poststongue slipvulgar words

Also read

Use Facebook to Comment on this PostMenu