07/6/19 12:47 PM

సీఎం జగన్ కి మాజీ సీఎం చంద్రబాబు వార్నింగ్

Chandrababu Warns AP CM Jagan

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి భద్రత కుదించడంపై చంద్రబాబు భగ్గుమన్నారు. తనకేమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. నాకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చెయ్యలేరు అని వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని రుద్రమాంబపురంలో వైసీపీతో ఉన్న వివాదంతో టీడీపీ మహిళా కార్యకర్త పద్మ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. పద్మ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరపున ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు వాపోయారు.

 

‘నాకు రక్షణ కల్పించడం లేదు.. భద్రత విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకున్నారు. నాకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని ఎవరూ కంట్రోల్‌ చేయలేరు’ అని చంద్రబాబు హెచ్చరించారు. పద్మను ఇంట్లో నుంచి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టారని, ఆమెను వివస్త్రను చేసి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఓ ఆడబిడ్డ పట్ల వీళ్లు అనుసరించిన తీరు అనాగరికంగా ఉంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించరు. హోంమంత్రి ఇలాంటివి మామూలే అంటున్నారు. దోషులు కళ్లముందే తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అని చంద్రబాబు నిలదీశా. దీనిపై తాము డీజీపీకి మెమోరాండం ఇస్తే ఎగతాళి చేశారని చంద్రబాబు వాపోయారు. రాష్ట్రాన్ని మరో పులివెందులలా మారుస్తారా అని మండిపడ్డారు. ప్రజలు తిరగబడితే పరిస్థితి అదుపు తప్పుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

 

పద్మ మృతిపై సరైన విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పద్మకు జరిగిన అవమానంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ధికారంలోకి వచ్చిన రోజు.. చీకటి రోజు అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా ఘటనలు జరిగాయని, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారని, ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదన్నారు.

Tags : ap cm ys jaganAttackschandrababumurderssecurityTDPtdp activistswarning

Also read

Use Facebook to Comment on this Post



Menu