05/17/19 11:10 AM

కొత్త ప్రభుత్వం కొత్త ప్రధాని రావడం ఖాయం

Chandrababu Will Decide PM Of India

ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మే 23వ తేదీ తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని ఆయన అన్నారు. అంతేకాదు కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని రావడం ఖాయమన్నారు. దేశ ప్రధానిని చంద్రబాబు డిసైడ్ చేస్తారని కూడా చెప్పారు. ఏపీలో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలపై మంత్రి దేవినేని ఫైర్ అయ్యారు. వారు చేసిన పాపాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్‌ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీ గెలవాలని… కేవీపీ కుట్రలు పన్నారని ఉమ ఆరోపించారు.

 

పోలవరం ప్రాజెక్టుపై సాక్షి పత్రిక దుర్మార్గపు రాతలు రాస్తోందని దేవినేని మండిపడ్డారు. సంస్థల పేరుతో కొందరు రిటైరైన అధికారులను జగన్ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి పంపించారని అన్నారు. డ్యామ్ సైట్‌లో 45 నిమిషాలు కూడా లేని ఆ అధికారులు రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి కడుపులో ఉన్న విషాన్ని అంతా కక్కేశారని ఆరోపించారు. ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన అధికారులు అక్కడి ఇంజినీర్లతో చర్చించాలని, అలా చేయకుండా రాజమండ్రి వచ్చి ప్రాజెక్టు పనుల్లో సర్వం అవినీతి జరుగుతోందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునిక దేవాలయం వంటి ప్రాజెక్టుపై ఇంత దుర్మార్గంగా, బాధ్యతా రాహిత్యంగా ఎలా మాట్లాడతారని మంత్రి దేవినేని నిలదీశారు. అన్నం తినేవారు ఎవరూ ఇలాంటి పని చేయరని జగన్‌ను ఉద్దేశించి మంత్రి దేవినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని.. పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్‌లైన్‌‌లో ఉందన్నారు.

 

ఈవీఎంలకు మరమ్మతులు చేయాలని లేదంటే కొత్తవి పెట్టాలన్నారు. మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకున్నారని.. ఒక ఈవీఎం స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ఆరు గంటల సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఈవీఎంలు పాడైతే మళ్లీ వచ్చి పోలింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Tags : chandrababudevineni umamodipolavaramrahul gandhiTDPYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu