10/16/18 11:53 AM

చిరంజీవి సంచలన నిర్ణయం..? తమ్ముడికి అండగా నిలుస్తారా?

chiranjeevi to join janasena

ఏపీలో దాదాపు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందా? మరో కీలక నాయకుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు షికారు చేస్తున్నారు. ఇందుకు కారణం చిరంజీవి వైఖరే. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న చిరంజీవి.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని సైతం పునరుద్ధరించుకోలేదు. ఇటీవలే చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసింది. అయినా ఆయన దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ కు దూరమైనట్లేనని, కాంగ్రెస్ ను వీడుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాల వల్లే కాంగ్రెస్‌కు చిరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

 

కాగా, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్రనాయకులు.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకే కాదు.. రాజకీయాలకు సైతం దూరంగా ఉండాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

నటుడిగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి… ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

 

అంతేకాకుండా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత తమ్ముడి పార్టీలోకి అడుగుపెట్టాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

మొత్తంగా చిరంజీవి కాంగ్రెస్ కు మాత్రమే గుడ్ బై చెబుతారా? లేక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? లేక తమ్ముడు స్థాపించిన జనసేనలో చేరతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి క్లారిటీ రావాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

Tags : chirajeevi to say good bye to politicschiranjeevichiranjeevi congress membershipchiranjeevi janasenachiranjeevi to say good bye to congressMegastar chiranjeevipawan kalyan

Also read

Use Facebook to Comment on this Post



Menu