05/15/19 11:27 PM

చంద్రబాబు సర్వే : విజయానికి కారణం అదేనట

cm-chandrababu-full-confidence-on-tdp-win

మరికొన్ని రోజుల్లో ఉత్కంఠ వీడనుంది. ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు? కాబోయే సీఎం ఎవరు? అనేది తేలిపోనుంది. గెలుపుపై పార్టీల అంచనాలు, ధీమాలు ఎలా ఉన్నా… ఓటర్ తీర్పు ఏంటన్నది మే 23వ తేదీన తేలిపోనుంది. ఫలితాల సంగతి అటుంచితే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీడీపీ మరోసారి గెలవడం ఖాయం అని ఆయన తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈసారి మరో 8 సీట్లు ఎక్కువే వస్తాయని అంటున్నారు. అంటే.. టీడీపీకి 110 సీట్లు వస్తాయట. అంతేకాదు.. టీడీపీని ఆదరించింది ఎవరు? వైసీపీకి ఓట్లు వేసింది ఎవరు? అనే వివరాలు కూడా బాబుగారు చెబుతున్నారు. ఏపీలో గెలుపెవరిది? అని తెలుసుకోవడానికి చంద్రబాబు ఓ సర్వే చేయించారట. ఆ సర్వేలో టీడీపీ గెలుస్తుందని తేలిందట.

 

వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ఫలితాలపై టీడీపీ 4 సర్వేలు చేయించిందని తెలుస్తోంది. 4 సర్వేల్లోనూ టీడీపీనే గెలుస్తుందని తేలిందట. మొదటి సర్వేలో టీడీపీకి 150 సీట్లు వస్తాయని తెలిసింది. అయితే ఆ సర్వేను పక్కన పెట్టిన చంద్రబాబు… మరోసారి సర్వే చేయించారట. రెండో సర్వేలో 110 సీట్లు వస్తాయని తెలియగా… ఈ రెండు సర్వేలతోపాటూ… పార్టీ నేతలకు కూడా తెలియకుండా చంద్రబాబు మరో 2 సర్వేలు చేయించారని చెప్పుకుంటున్నారు. ఆ రెండు సీక్రెట్ సర్వేల్లోనూ టీడీపీకి 100 నుంచి 120 సీట్ల దాకా వస్తాయని తేలడంతో… అన్నింటినీ లెక్కలోకి తీసుకుని చివరికి చంద్రబాబు 110 సీట్లకు ఫిక్స్ అయ్యారని సమాచారం.

 

టీడీపీ జరిపించిన సర్వేల ప్రకారం… వృద్ధులు, మహిళలు టీడీపీకి ఓటు వేశారట. యువత మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపిందట. పథకాల విషయంలో ప్రజలు కొంతవరకు సంతృప్తిగానే ఉన్నా.. ఉద్యోగాల కల్పనలో మాత్రం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోవడం వల్ల యువత వైసీపీ వైపు మళ్లిందని అంతర్గత సర్వేల్లో తేలినట్లు తెలిసింది. తమ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారంటున్న చంద్రబాబు… అందుకే ఈసారి 2014లో కంటే 8 సీట్లు ఎక్కువే సాధిస్తామన్నట్లు చెబుతున్నారు.

 

టీడీపీ సర్వేలపై వైసీపీ ఫైర్ అయ్యింది. గెలుస్తామనే ధీమా ఉంటే 4 సర్వేలు ఎందుకు చేయించారని వైసీపీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే 4 సర్వేలు చేయించారని విమర్శలు చేశారు. గెలిచే సీన్ ఉంటే 4 రకాల సర్వేలెందుకు చేయించారని చంద్రబాబుని నిలదీస్తున్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వైసీపీ అంటోంది. గెలుపు తమదే అని, 120 నుంచి 140 స్థానాలు రావొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-వైసీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం 2శాతం కన్నా తక్కువే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా… టీడీపీ 102 సీట్లు గెలిచింది. ఆ పార్టీకి 46.30 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ 67 సీట్లు సాధించగా ఆ పార్టీకి 44.47 శాతం ఓట్లు లభించాయి. అంటే 1.83 శాతం ఓట్ల తేడాతో.. 35 సీట్లు తారుమారయ్యాయి. మొత్తంగా ఎవరి అంచనాలు నిజం అవుతాయో? ఎవరు అధికారంలోకి వస్తారు? ఓటర్లు ఎవరిని ఆదరించారు? అనేది మే 23న తేలిపోనుంది.

Tags : ap cm chandrababuchandrababu surveyTDPwinys jaganysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu