03/13/19 1:20 PM

జగన్ గెలిస్తే: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Cm Chandrababu Sensational Comments On YS Jagan

ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ను గెలిపిస్తే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తాజాగా మరోసారి జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ కోరుకుంటున్నది ముఖ్యమంత్రి పీఠాన్ని కాదని, రాష్ట్ర ప్రజల మరణ శాసనాన్ని అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రేటు పెట్టారన్నారు. డబ్బు ఇస్తున్న వారికే టికెట్లను ఇస్తున్నారని అన్నారు. జనరల్ సెగ్మెంట్ కు ఓ రేటు, రిజర్వేషన్ సెగ్మెంట్ కు మరో రేటును జగన్ పెట్టారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నుంచి వచ్చిన వారే తనకు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు.

 

ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఊడిగం చేసేందుకు జగన్ సిద్ధం అయ్యారని విమర్శించారు. జగన్ గెలిస్తే, అభివృద్ధి కుంటుపడిపోతుందని, ప్రజలకు సంక్షేమం దూరమవుతుందని బాబు హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే, కేసీఆర్ చెప్పిన చోటల్లా జగన్ సంతకాలు పెట్టుకుంటూ పోతారని విమర్శలు గుప్పించారు. తన మాటను వినకుంటే, జగన్ అవినీతి ఫైల్ పై కేసీఆర్ సంతకం పెడతారని అన్నారు. ఈ నెల రోజులూ ప్రతి ఒక్కరూ టీడీపీ విజయం కోసం ప్రతిక్షణం కృషి చేయాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు చెప్పి, మరోమారు ఓటు వేయాలని అడగాలని చంద్రబాబు సూచించారు.

 

జగన్ ఓటు తొలగించాలని ఫారం-7 దరఖాస్తు రావడంపై చంద్రబాబు వ్యంగంగా స్పందించారు. ఇలాంటి విచిత్ర వేషాలు జగన్ ఇంకా ఎన్నో చూపిస్తారని వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు బాబు పిలుపునిచ్చారు. 18వ తేదీ నుంచి లబ్ధిదారులే వచ్చి తెలుగుదేశానికి ప్రచారం చేసే పరిస్ధితి ఉందని తెలిపారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని పసుపు సైనికులు అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మోడీ, కేసీఆర్, జగన్ అనుబంధం ఈడీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా బయటపడిందని చంద్రబాబు చెప్పారు. ఈడీ లేఖపై వైసీపీని నిలదీయాలని శ్రేణులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది ముఖ్యమంత్రి వెల్లడించారు. 16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖం పూరించి అదే రోజు శ్రీకాకుళంలో పర్యటించునున్నట్లు చెప్పారు.

Tags : ap electionscm chandrababuKCRmodiTDPticketsys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu