08/11/19 9:32 PM

బాబుగారూ సీఎం జగన్ గురించి ఇప్పుడు ఏమంటారు..?

CM Jagan Kindness, Money Help For TDP Leader Daughter copy

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అది అవసరం కూడా. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం కామన్. పైచేయి కోసం నాయకులు అలా చేస్తుంటారు. కానీ ఆపదలో లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రత్యర్థిని సైతం ఆదుకున్న వాడే అసలు సిసలు నాయకుడు. కష్టాల్లో ఉన్న వ్యక్తి మనోడా, పరాయి వాడా అని కూడా చూడకుండా సాయం చేసినోడే అసలైన లీడర్. ఈ విషయంలో వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతైనా.. సాయం చేయాలని కోరితే వెంటనే చేశారు. తనకు స్వపక్షం అయినా ప్రతిపక్షం అయినా ఒక్కటే అని, తాను మానవతావాదిని అని నిరూపించుకున్నారు.

 

ఏపీ సీఎం జగన్ తన ఔదార్యం చాటుకున్నారు. ప్రతిపక్ష నేత కూతురు వైద్యానికి ఆర్థిక సాయం చేశారు. రూ.10 లక్షలు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. కేన్సర్‌తో బాధపడుతున్న పలాస టీడీపీ నేత పీరుకట్ల విశ్వేశ్వరరావు కుమార్తె సాయి శిరీషకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.10లక్షలు ఇచ్చారు. డబ్బు లేక ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే సీఎం జగన్ ఆశయమని వైసీపీ నేత, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షల ప్రోసిడింగ్ పత్రాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు అందజేశారు. రాజన్న రాజ్యంలో రాజకీయాలకు అతీతంగా సాయం చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

 

సీఎం జగన్ సాయంపై టీడీపీ నేత విశ్వేశ్వరరావు స్పందించారు. సీఎంకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనిపై పలువురు వైసీపీ నేతలే కాదు టీడీపీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం అన్నారు. సీఎం జగన్ రాజకీయాలకు అతీతంగా అందరిని సమానంగా చూస్తారని వైసీపీ నేతలు చెప్పారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని, చేతనైన సాయం చేస్తారని వెల్లడించారు. ఈ ఘటనతో తన పాలనలో రాజకీయాలకు తావులేదని సీఎం జగన్ మరోసారి నిరూపించారని మెచ్చుకున్నారు.

 

అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేత కూతురు వైద్యానికి సీఎం జగన్ సాయం చేయడం విశేషం. బాబుగారు మరిప్పుడు ఏమంటారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కి కక్ష ఉంటే.. టీడీపీ నేత కూతురికి ఎలా సాయం చేస్తారు అని ప్రశ్నించారు. సీఎం జగన్ కి అందరూ సమానమే అని వారు చెప్పారు. అందుకు ఈ సాయం పెద్ద నిదర్శనం అన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవతా కోణంలో స్పందించారని.. సీఎం జగన్ తన ఉదారతను, ఔదార్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.

 

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు రిలీజ్ చేయడం కూడా పెద్ద సంగతి ఏమీ కాదనొచ్చు. అదేదో జగన్ తన జేబు నుంచి డబ్బు ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు అని విమర్శలు చేయొచ్చు. ఈమాత్రం సాయానికి ఇంత పబ్లిసిటీ, డప్పు అవసరమా అని మండిపడొచ్చు. కానీ.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు రిలీజ్ చేయడం నిజంగా గొప్ప సంగతే అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ కే కనుక కక్ష ఉంటే.. టీడీపీ నేత పెట్టుకున్న అర్జీని తిప్పి పంపొచ్చు లేదా నెలల తరబడి పెండింగ్ లో ఉంచొచ్చు. అదీ కాదంటే.. నిర్మొహమాటంగా అర్జీని రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ రాజకీయాలకంటే.. మానవత్వం ముఖ్యం. అందుకే సీఎం జగన్ వెంటనే ఆమోదించారని, డబ్బు సాయం అందేలా చూశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదేదో మెప్పు కోసమో పబ్లిసిటీ కోసమో చేసిన పనిగా చూడొద్దన్నారు.

 

ys jagan help

Tags : ap cm jaganchandrababucm relief fundhelpmedical helpsrikakulamTDP leadertdp leader daughterysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu