04/9/19 7:22 PM

పవన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రాణమిత్రుడు : కారణం అదేనా?

comedian ali strong counter for pawan kalyan

వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఆయన సినిమాల్లో కచ్చితంగా ఈయన ఉండాల్సిందే. ఎవరున్నా లేకున్నా. అతడు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. మేమిద్దరం ప్రాణస్నేహితులం అని వాళ్లే స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నారు. అలాంటి ఒక్కసారిగా బెడిసికొట్టింది. మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఒకరి పరువు మరొకరు తీసుకునే వరకు వెళ్లింది. వారిద్దరి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.. ఆ ఇద్దరు ఎవరు అనేది.. మీ గెస్ కరెక్ట్.. వాళ్లే పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ.

 

సినిమాల్లో తన పక్కన అలీ ఉంటే.. అదో రకమైన ఉత్సాహం ఉంటుందని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు. అంతటి రిలేషన్ ఇద్దరి మధ్య ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ‘జనసేన’ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే.. అలీ ఆ పార్టీలో చేరిపోతారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా అలీ వైసీపీలో చేరి పవన్ సహా అందరికీ షాకిచ్చారు. దీని గురించి పవన్ చాలా రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. చివరికి ఏపీ ఎన్నికల ప్రచారంలో అలీపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ తన బెస్ట్ ఫ్రెండ్, కమెడియన్ అలీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ ఊహించని విధంగా అలీ గురించి మాట్లాడారు.

 

అలీని నమ్మితే..మోసం చేసి వెళ్లిపోయాడని పవన్ వాపోయారు. ఇదేనా స్నేహం అంటే.. అంటూ పవన్ ప్రశ్నించారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలీ సూచించిన వ్యక్తికే నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని..కానీ ఆయన మాత్రం వైసీపీకి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని.. తనతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పా పెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని పవన్ వాపోయారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో రాణించలేను అని అలీ ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. అలీ స్వస్థలమైన రాజమండ్రిలో.. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.

 

‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో నేను స్టార్‌ అవుతానని ఎవరైనా అనుకున్నారా? అవసరంలో ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా నేను ఎవరిని నమ్మాలి. అందుకే నేను స్నేహితులను, బంధువులను నమ్మను.. కేవలం ప్రజలను మాత్రమే నమ్ముతాను’ అని పవన్ అన్నారు. అలీ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

పవన్ కామెంట్ చేసి కొన్ని గంటల్లోనే వైసీపీ నేత అలీ స్పందించారు. అది కూడా ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. పవన్ కి దిమ్మతిరిగేలా బదులిచ్చారు. ప్రాణమిత్రుడైన అలీ తనకు చెప్పకుండానే వైసీపీలోకి వెళ్లారని, అలీ లాంటి వాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతోందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అలీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వ్యక్తిని అన్నారు. పవన్‌పై తాను ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ.. తనపై పవన్ ఆరోపణలు చేయడం బాధించిందన్నారు.

 

తనను పవన్ ఏ రోజు కూడా జనసేనలోకి ఆహ్వానించలేదని అలీ చెప్పారు. తాను వైసీపీలోకి వెళ్తే తప్పేంటని అలీ ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో పవన్ సినిమాల్లోకి వచ్చారు. కానీ తాను స్వశక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని పవన్‌కు అలీ చురకలు అంటించారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని పవన్ అన్నారు. మీరు నాకు ఏ సాయం చేశారు? నాకేమైనా డబ్బులిచ్చారా? లేదంటే సినిమాల్లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే అవకాశాలు ఇప్పించారా? అని ప్రశ్నించారు.

 

పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్ లో ఉన్నానని అలీ గుర్తు చేశారు. ఆర్థిక సాయం చేయాలని ఎవర్నీ ఏనాడూ అడగలేదన్నారు. అల్లా దయతో బాగున్నాను, ఆకలితో చస్తాను తప్పితే.. వెళ్లి ఎవర్నీ అడగను అని అలీ స్పష్టం చేశారు. నేను వైసీపీలోకి వెళ్లడం నేరమా? వైసీపీలోకి నేను వెళ్లొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? అని పవన్‌ను ప్రశ్నించారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే స్వేచ్ఛ నాకు లేదా? అని అలీ నిలదీశారు. నా బంధువుకి జనసేన టికెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. కానీ తనకు టికెట్ ఇవ్వమని నేను మిమ్మల్ని అడిగానా? అని ఆయన ప్రశ్నించారు.

 

వైసీపీ తరపున పోటీలో లేని అలీని విమర్శించాల్సిన అవసరం పవన్‌కు ఏమొచ్చిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో చేరినా… ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌పై అలీ విమర్శలు చేయలేదు. పైగా పవన్ రాజకీయంగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తిపై పవన్ ఎందుకు ఫైర్ అయ్యారన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ విమర్శలకు అలీ కౌంటర్ ఇస్తారా లేదా అని అంతా చర్చించుకున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇవ్వకపోతే… అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బంది కలిగించే పరిణామం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో అలీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. అయితే కౌంటర్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ , అలీ మధ్య ఉన్న గ్యాప్ మరింతగా పెరిగింది. మొత్తంగా ఈ పరిణామం పవన్, అలీలను అభిమానించే ఫ్యాన్స్ ను బాధించింది. ప్రాణమిత్రులు ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags : alijanasenapawan kalyanYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu