04/27/19 7:09 PM

వైఎస్ జగన్‌ను నిలదీసిన విజయశాంతి

Congress Leader VijayaShanti Question YS Jagan

సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో జగన్ ని నిలదీశారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారు… ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారు అని ఆరోపిస్తూ రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీని జగన్ బహిష్కరించారని గుర్తు చేసిన విజయశాంతి.. మరి, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? అని ప్రశ్నించారు. ఏపీలో తప్పయిన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో తెలపాలని విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

 

నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కలిశారు. అంతేకాదు తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామని కేసీఆర్, కేటీఆర్ బహిరంగ సభల వేదికగా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే తమ ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా.. జగన్ ఇంటికెళ్లి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్, జగన్ ప్రెస్‌మీట్ పెట్టి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ ఈ ఫ్రంట్‌ విషయమై రాష్ట్రాలబాట పట్టనున్నారు. తాజాగా.. ఈ ఫ్రంట్ వ్యవహారంపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పోస్ట్‌లో కేసీఆర్, వైఎస్ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు.

Tags : chandrababufederal frontKCRTelangana CongresstrsVijayashantiys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu