10/11/18 10:40 PM

ఉదయం కాంగ్రెస్ కి.. సాయంత్రం బీజేపీకి షాక్ ఇచ్చిన పద్మినీరెడ్డి..!

padmini reddy back to congress

పద్మినీ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ సంచలనం రేపిన పేరు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి వ్యవహార శైలి తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుని సంచలనానికి తెరలేపిన ఆమె.. అంతలోనే మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బీజేపీలో చేరి 24గంటలు కూడా గడవకముందే ఆమె మనసు మార్చుకున్నారు. పద్మినీరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు.

 

పద్మినీరెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పద్మినీరెడ్డి రాకతో బీజేపీ నాయకులు కూడా ఖుషీగా ఫీల్ అయ్యారు. ఇంతలోనే బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. ఈ ఉదయం పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా, భర్త రాజనర్సింహ కాంగ్రెస్‌లో ఉండగా.. ఆయన భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంతో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ ఉన్న వేళ, ఆయన భార్య ఇలా బీజేపీలో చేరడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విస్మయానికి గురయ్యాయి. ఇవేం రాజకీయాలు? అని అంతా పెదవి విరిచారు. పద్మినీరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల ప్రభావమో మరో కారణమో తెలియదు కానీ.. ఆమె తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు.

 

సంగారెడ్డిలోతన నివాసంలో మీడియాతో మాట్లాడిన పద్మినీరెడ్డి.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. కార్యకర్తల మనోభావాలను, వారి మనోవేదనను అర్థం చేసుకున్నానని అందుకే తిరిగి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పద్మినీరెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ‌లోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన పరిణామని ఆమె అభివర్ణించారు. ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. అయితే తాను పార్టీని వీడిన కొద్దిసేపటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున తనతో మాట్లాడి వెళ్లొద్దని చెప్పినట్లు పద్మినీరెడ్డి పేర్కొన్నారు.

 

గురువారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరిన పద్మినీరెడ్డి… తన భర్త దామోదర రాజనరసింహకు చెప్పే తానే బీజేపీలోకి వచ్చానని అన్నారు. బీజేపీ అధిష్టానం సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి తీరతానని తెలిపారు. తాను మోదీ అభిమానినని… ఆయన చేపట్టిన పథకాలు నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్టు చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారతావని ప్రగతి బాటన నడుస్తోందని ప్రశంసించారు కూడా.

Tags : damodara rajanarasimhaPadmini reddypadmini reddy back to congress. Padmini reddy joins bjpTelangana Congress

Also read

Use Facebook to Comment on this Post



Menu