05/5/19 1:10 PM

చినబాబుకి ఓటమి భయం : దినపత్రిక సంచలన కథనం

Defeat Fear For Nara Lokesh, Tamil News Paper Sensational Story

ఏపీలో ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారాయి. అందరి చూపు ఏపీ ఫలితాలపై ఉంది. ఎందుకంటే.. ఏపీలో ఉన్నది ఒకరు జాతీయ స్థాయి నేత, మరొకరు యువ నేత. వారే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో టీడీపీ గెలుస్తుందా? వైసీపీ అధికారంలోకి వస్తుందా? అని రాష్ట్ర నాయకులు, ప్రజలే కాదు..జాతీయ నాయకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ఫస్ట్ టైమ్ సీఎం చంద్రబాబు తనయుడు, భావి సీఎంగా టీడీపీ నాయకులు చెప్పుకుంటున్న నారా లోకేష్.. ఎన్నికల బరిలోకి దిగారు. ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో లోకేష్ గెలుస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ గెలుపోటములపై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మంగళగిరిలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. మంగళగిరిలో లోకేష్ ఓడిపోతే టీడీపీ పరువు గంగలో కలిసినట్టు అవుతుంది. ఎందుకంటే లోకేష్ ని.. టీడీపీ నాయకులు కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నారు.

 

ఇక పోతే.. మంగళగిరిలో లోకేష్ గెలుపుపై తమిళనాడుకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘దిన మలర్’ ‘ఆదిలోనే హంసపాదు’ అనే శీర్షికతో ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. మంగళగిరిలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన లోకేష్ కు ఓడిపోతానన్న భయం ఉందన్నది ఈ కథనం సారాంశం. తండ్రి సీఎంగా ఉండి కూడా, ఓటమి తప్పదేమోనన్న ఆందోళనలో లోకేష్ ఉన్నారని, మంత్రిగా ఉండి కూడా కచ్చితంగా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదని పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్న లోకేష్ కు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత గెలుపు సులువు కాదని తెలిసివచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆందోళనలో ఉన్నారని పేర్కొంది.

 

మంగళగిరిలో వైసీపీ తరుఫున ఆర్కే బరిలో ఉన్నారు. స్థానికంగా ఆయనకు గట్టి పట్టు ఉంది. పలు అంశాల్లో ప్రభుత్వంతో పోరాటం చేశారు. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అన్నారు. అలాంటి వ్యక్తిపై లోకేష్ పోటీ చేశారు. దీంతో లోకేష్ విజయావకాశాలపై అనేక సందేహాలు ఉన్నాయి. సర్వేల సంగతి, కథనాల సంగతి ఎలా ఉన్నా.. మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయం అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా లోకేష్ గెలుపుపై తమిళ పత్రికలో వచ్చిన కథనం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

Tags : Alla rama Krishna reddyap electionschandrababudinamalarmangalagirinara lokeshTDPysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu