04/14/19 9:18 PM

ఇప్పుడేం చేస్తారు? చంద్రబాబుకి గట్టి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

EVM Robber, EC Sensational Allegations

ఈవీఎంలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. చంద్రబాబుకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబుని ఇరుకున పడేసింది. చంద్రబాబు బృందంలో ఈవీఎం దొంగ ఉన్నాడని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై టీడీపీ, ఈసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

 

ఈవీఎంలో లోపాలు ఉన్నాయని ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 18 పేజీలతో కూడిన లేఖను ఈసీకి రాశారు. ఆ లోపాలపై చర్చించేందుకు ఈసీ ఓ భేటీని ఏర్పాటు చేసింది. దానికి ప్రభుత్వం తరుఫున సాంకేతిక నిపుడిని పంపాలని కోరింది. దీంతో ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు హరిప్రసాద్ ను చంద్రబాబు పంపించారు. అయితే హరిప్రసాద్ ను పంపించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ ని ఈవీఎం దొంగ అని చెప్పింది. ఈవీఎం చోరీ చేశాడని అతడిపై క్రిమినల్ కేసు నమోదైందని, అలాంటి వ్యక్తితో చర్చలు జరిపేది లేదని చంద్రబాబుకి తేల్చి చెప్పింది. హరిప్రసాద్ స్థానంలో మరొకరిని పంపించాలని ఈసీ కోరింది.

 

ఈసీ చేసిన కామెంట్స్ టీడీపీకి షాక్ ఇచ్చాయి. హరిప్రసాద్ ను ఈవీఎం దొంగ అని అనడంపట్ల చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఈవీఎం దొంగ కాదు ఈవీఎం హీరో అని చెప్పారు. ఈవీఎం ఎక్స్ పర్ట్ ని పట్టుకుని దొంగ అంటారా? అని ధ్వజమెత్తారు. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో ప్రూవ్ చేసిన వ్యక్తిని, ఈవీఎం లోపాలను బట్టబయలు చేసిన వ్యక్తి ఈవీఎం దొంగ అని అంటారా అని మండిపడ్డారు. ఎలాంటి ఛార్జ్ షీట్ లేనప్పుడు హరిప్రసాద్ ని క్రిమినల్ అని ఎలా అంటారు అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. ఈవీఎంల లోపాల వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడానికే ఈసీ ఇలా మాట్లాడుతోందని చంద్రబాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈవీఎంను హ్యాక్ చేయొచ్చని హరిప్రసాద్ 2010లో ప్రూవ్ చేశారు. ఓ టీవీలో లైవ్ లో చూపించారు. హరిప్రసాద్ చేసిన పని ఆయనకు ప్రశంసలతో పాటు విమర్శలను తీసుకొచ్చింది. అసలు ఆ ఈవీఎం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? అనే అనుమానాలు వచ్చాయి. ఈవీఎం చోరీ చేశారు అని ముంబైలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసు విచారణ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈసీ ఆ కేసుని ప్రస్తావించింది. ఈవీఎం దొంగతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది.

 

తనను ఈవీఎం దొంగ అని ఈసీ అనడం, ఈవీఎం టెక్నికల్ టెస్ట్‌కు ఈసీ తనను అనుమతించకపోవడంపై హరిప్రసాద్ తీవ్రంగా స్పందించారు. తన ప్రతిభ ఏంటో ప్రపంచం మొత్తం చూసిందని, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయని చెప్పారు. అలాంటి తనని ఈవీఎం దొంగ అనడం దారుణం అన్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని, అవి బయటపడితే పరువు పోతుందని, అందుకే  ఈసీ భయపడుతోందని అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అని హరిప్రసాద్‌ అన్నారు. 2010లో కేసుకు సంబంధించి చార్జ్‌షీటే దాఖలు కాలేదని…అలాంటప్పుడు తనని క్రిమినల్ అనడం…ఈసీ తన తప్పును కప్పిపుచ్చుకోవడమే అని అన్నారు. 10వ తేదీనే వీవీ ప్యాట్‌లో తాము తప్పును కనిపెట్టామని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హరిప్రసాద్‌ చెప్పారు.

 

హరిప్రసాద్ విషయంలో ఈసీ అభ్యంతరాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవీఎంలలో భద్రతాలోపాలను హరిప్రసాదే గుర్తించారని చెప్పారు. ఈవీఎంల పనితీరును అమెరికా, నెదర్లాండ్స్ పరిశోధకులతో కలిసి ఆయన అధ్యయనం చేశారన్నారు. ఏపీ సీఎంకు సాంకేతిక సలహాదారు హోదాలోనే హరిప్రసాద్ ముందుకు వచ్చారని స్పష్టం చేశారు. ఓ సాంకేతిక నిపుణుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని తేల్చి చెప్పారు. ఈవీఎంలపై రేపు(ఏప్రిల్ 15) ఈసీ సాంకేతిక కమిటీతో చర్చించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Tags : ap cm chandrababuecevm malfunctionEvm tamperingevm thefthari krishna prasad vemuruHari Prasadhari prasad vemuruTDP

Also read

Use Facebook to Comment on this PostMenu