06/12/19 7:42 PM

ఎట్టకేలకు అనుకున్నది సాధించిన రోజా

Finally MLA Roja Gets Key Post

ఎట్టకేలకు వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అనుకున్నది సాధించారు. సీఎం జగన్ ఆమెకి న్యాయం చేశారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నా రోజా కీలక పదవిని దక్కించుకున్నారు. పవర్ ఫుల్ పోస్టులో అపాయింట్ చేశారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజా నియమితులయ్యారు. అనుకున్నట్టుగానే సీఎం జగన్ ఆమెకి నామినేటేడ్ పోస్టు కట్టబెట్టారు. నిన్న విజయవాడలో జగన్ ని కలిసిన ఆమె.. పదవి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజాని అపాయింట్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది.

 

తనకు ఏపీఐఐసీ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా ధన్యవాదాలు తెలిపారు. ‘నాపై నమ్మకముంచి నన్ను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృత‌జ్ఞ‌త‌లు’ అని రోజా తన ఫేస్ బుక్ లో తెలిపారు. నామినేటేడ్ పదవి దక్కడంతో రోజా కూడా సంతోషంగా ఉన్నారు.

 

రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రోజాకి కేబినెట్ పదవి ఖాయమని అంతా అనుకున్నారు. పైగా జగన్ కి సన్నిహితురాలు కావడంతో.. మంత్రి పదవి గ్యారంటీ అని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జగన్ రోజాని పక్కన పెట్టారు. మంత్రి పదవి ఇవ్వలేదు. సామాజిక కోణంలో ఆమెకి మినిస్టర్ పదవి దక్కలేదు. దీంతో రోజా హర్ట్ అయ్యారని, అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆమె కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారి పేర్లు ప్రకటించగానే ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే మంగళవారం అమరావతికి చేరుకున్న ఆమె.. ముఖ్యమంత్రి జగన్‌ని కలిశారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కష్టపడి పనిచేశామన్నారు. జగన్ తో ఏం మాట్లాడారో కానీ.. కీలకమైన నామినేటేడ్ పోస్టుని దక్కించుకున్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పించడంలో ఏపీఐఐసీ చాలా కీలకమైనది. ఆలస్యం అయినా కీలకమైన పదవిని జగన్ తనకు కట్టబెట్టడం రోజాలో ఆనందం నింపింది. రోజా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Tags : apiic chairmanmla rojanominated postYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu