02/6/19 8:04 PM

100 రోజులు కష్టపడండి, ఆ తర్వాత వచ్చేది ప్రజా ప్రభుత్వమే : జగన్

I Will Become CM, Says YS Jagan

2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని, సీఎం అవ్వాలని కసిగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో తిరుమల వెంకన్న సాక్షిగా జగన్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ద్వారా సమరానికి సై అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చారు. అలాగే నవరత్నాలతో పాటూ కీలకమైన హామీలు ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ నింపే స్పీచ్ ఇచ్చారు. ”అన్న ముఖ్యమంత్రి అవుతాడని” అందరికి చెప్పాలని జగన్ అన్నారు.

 

100 రోజుల పాటు కష్టపడితే ఆ తర్వాత ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నదని జగన్ గుర్తు చేశారు. ఈ ఎన్నికలు ప్రజల అభిమానం, ధనం మధ్యే జరుగుతుందని చెప్పారు. ప్రజల అభిమానం తనకు ఉందని, వారి కోసం తాను ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తానని చెప్పారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే తాను 3వేల 678 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు.

 

కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా తాను పరిపాలన అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కష్టపడాలని సూచించారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్ల పాటు ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారని జగన్ వాపోయారు. 14 ఏళ్ల పాటు చంద్రబాబు పరిపాలను చూశామని, ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా పరిపాలించ లేకపోయారని జగన్ అన్నారు.

 

ఈ ఎన్నికల్లో ఓటర్లకు తలో 3వేల రూపాయలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోదని జగన్ ఆరోపించారు. టీడీపీ ఇచ్చే డబ్బు తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. అయితే చంద్రబాబు సీఎం కాకూడదని దేవుడిని కోరుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో పాటు ఎల్లో మీడియాపైనా ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను సీఎం కాగానే పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Image may contain: one or more people, crowd and outdoor

Tags : ap electionscm chandrababucm jaganelection campaignsamara shankaravamTDPys jaganys jagan tirupati speechysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu