02/28/19 11:46 AM

క్షేమంగా తిరిగిరావాలి : దేశ హీరో అభినందన్‌ను రక్షించుకోవడం ఎలా

If Vikram Abhinandan Not Released, Will India Declare War On Pakistan

ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ గట్టి బుద్ధి చెబుతున్న వేళ మనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాక్ పని పట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే టైమ్‌లో పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది. ఇక పాకిస్తాన్ పని ఖతమ్ అనుకుంటూ సంతోషంగా ఉన్న తరుణంలో అనుకోని సమస్య ఉత్పన్నమైంది. భారత వాయుసేన వింగ్ కమాండర్ ఒకరు పాకిస్తాన్‌కు బందీగా చిక్కడం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. అందరిలోనూ ఒకరకమైన బాధను, ఆవేదనను నింపింది. ఆ ఫైటర్ ఫైలెట్ క్షేమంపై ఆందోళన నింపింది.

 

బుధవారం(ఫిబ్రవరి 27) ఉదయం పాకిస్తాన్ వైమానిక దళ విమానాలు మన భూభాగంలోకి చొరబడి దాడికి యత్నించాయి. పలు ప్రాంతాల్లో బాంబులు వేశాయి. వెంటనే అలర్ట్ అయిన భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. పాక్ యుద్ధ విమానాలపై ఎదురుదాడికి దిగాయి. పాక్ విమానాలను తరిమితరిమి కొట్టాయి. ఓ యుద్ధ విమానాన్ని వెంటాడి, వేటాడి కూల్చాయి. ఈ క్రమంలో ఊహించని ఘోరం జరిగింది. పాక్ విమానాలను వేటాడే క్రమంలో మన వైమానిక దళానికి చెందిన విమానం(మిగ్-21) ఒకటి పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. అందులో ఉన్న ఫైటర్ పైలట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ సాయంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. అయితే ఆయన ల్యాండ్ అయ్యింది పాకిస్తాన్ భూభాగంలో.

 

వెంటనే పాక్ బలగాలు అభినందన్‌ను చుట్టుముట్టాయి. అసలే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికులు ఆవేశంతో ఉన్నారు. దీంతో భారత ఫైటర్ పైలట్ దొరికేసరికి పాక్ సైనికులు రెచ్చిపోయారు. విక్రమ్‌ను చుట్టుముట్టి విచక్షణారహితందా దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు, కాళ్లతో తన్ని హింసించారు. వాళ్ల దాడిలో విక్రమ్ కంటి కింద గాయమై రక్తం వచ్చింది. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలపై దాడి చేయకూడదు. కానీ పాక్ సైనికులు నిబంధనలకు పాతరేశారు. విక్రమ్‌పై దాడి చేశారు. మన విక్రమ్‌ను కొట్టడమే కాకుండా దాన్ని వీడియో తీసి బయటకు రిలీజ్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ.

Image result for vikram abhinandan

ఆ తర్వాత విక్రమ్ అభినందన్‌ను పాక్ ఆర్మీ తమ కస్టడీలోకి తీసుకుంది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్టు ఆయనతో వ్యవహరించారు. కళ్లకు గంతలు కట్టారు, చేతులు వెనక్కి కట్టేశారు. ప్రశ్నల వర్షం కురిపించారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. నీ పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? మీ మిషన్ ఏంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా విక్రమ్ అభినందన్ వీరుడిలా నిలిచాడు. అంతమంది శత్రువులు చుట్టుముట్టినా అస్సలు భయపడలేదు. ధైర్యంగా జవాబిచ్చాడు. కొన్ని ప్రశ్నలకు నేను జవాబు చెప్పదల్చుకోలేదు అని తేల్చి చెప్పాడు. శత్రువుల కస్టడీలో ఉన్నా, శత్రువులు చుట్టుముట్టినా విక్రమ్ అభినందన్ చూపిన ధైర్యం, తెగువ ప్రతి ఇండియన్‌ను సెల్యూట్ చెప్పేలా చేసింది. యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది.

Image result for vikram abhinandan

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి మరీ టెర్రరిస్టుల శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. వారి శిబిరాలను ధ్వంసం చేసి 300మంది టెర్రరిస్టులను హతమార్చింది. భారత్ దెబ్బతో పాకిస్తాన్ విలవిలలాడిపోయింది. భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయ్యింది. రెండు మూడు రోజుల్లో భారత్ మరో దాడికి సిద్ధమవుతున్న తరుణంలో.. విక్రమ్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కడం.. భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ను దెబ్బకొట్టే పనిలో ఉన్న భారత్ దూకుడుకి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇప్పుడు భారత్ ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం… విక్రమ్ అభినందన్‌ను సురక్షితంగా విడిపించుకోవడం.

 

విక్రమ్ అభినందన్‌ క్షేమంగా ఉండాలని, సురక్షితంగా తిరిగిరావాలని యావత్ భారత్ కోరుకుంటోంది, ప్రార్థనలు చేస్తోంది. విక్రమ్‌ను వెంటనే ఇండియా తీసుకొచ్చే చర్యలపై భారత ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందుకు తగ్గ చర్యలు చేపట్టింది. జెనీవా ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీలను వారం రోజుల్లోగా విడుదల చేయాలి. పాకిస్తాన్ ఈ నియమాన్ని గౌరవించాలని, వెంటనే అభినందన్‌ను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఓ లేఖ ద్వారా పాక్‌కు అల్టిమేటట్ జారీ చేసింది. కానీ ఇప్పటివరకు పాక్ స్పందించలేదు. పైగా బోర్డర్‌లోని భారత ఆర్మీ పోస్టులపై యథేచ్చగా కవ్వింపు కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మన ఆర్మీ పోస్టులపై పాక్ సైనికులు ఫైరింగ్ జరుపుతున్నారు.

Image result for vikram abhinandan

అసలే పాకిస్తాన్. దొంగ దెబ్బలు కొట్టడంలో ఆరితేరిన దేశం. ఏ అవకాశం దొరికినా భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసే పాకిస్తాన్.. జెనీవా ఒప్పందాన్ని గౌరవిస్తుందా? విక్రమ్ అభినందన్‌ను అంత ఈజీగా రిలీజ్ చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రమ్‌ను అడ్డుపెట్టుకుని పాక్ కొత్త డ్రామాకు తెరతీస్తుందా? అనే సందేహాలు లేకపోలేదు. ఒకవేళ పాకిస్తాన్ వారం రోజుల్లో విక్రమ్‌ను రిలీజ్ చేయకపోతే ఏం చేయాలి? అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వచ్చినా పాక్ పట్టించుకోకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? భారత ప్రభుత్వం ఇలా అన్ని రకాలుగా ఆలోచన చేస్తోంది. అన్ని మార్గాల్లో పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చి విక్రమ్‌ను విడిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇంత చేసినా ప్రయోజనం లేకపోతే మాత్రం.. పాకిస్తాన్‌పై ఫైనల్‌గా యుద్ధం చేయాల్సిందే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వార్ డిక్లేర్ చేసి పాక్‌ను నామరూపాలు లేకుండా చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది. యుద్ధం ఒక్కటే మార్గమా? మరో దారి ఏదైనా ఉందా? దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

పాకిస్తాన్ ఎంత దుర్మార్గపు దేశం అన్నది మాటల్లో చెప్పలేము. భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ ఉదంతం పాక్ పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనం. జాదవ్‌పై గూఢచారి ముద్ర వేసిన పాక్ ఆయనను 2016లో అరెస్ట్ చేసి నిర్భందించింది. జాదవ్‌ను అడ్డుపెట్టుకుని ఎమోషనల్‌గా భారత్‌ను బ్లాక్ మెయిల్‌ చేస్తోంది. అసలు జాదవ్ గూఢచారే కాదు. ఆయనపై ఆ ఆరోపణలు వేసి జైల్లో వేసింది. జాదవ్ గూఢచారి కాదని, వెంటనే వదిలేయాలని భారత్ ఎన్ని వాదనలు వినిపించినా, అంతర్జాతీయ సమాజం నుంచి  ఒత్తిళ్లు తెచ్చినా.. పాక్ మాత్రం లొంగడం లేదు. పాక్ ఎంతకు బరితెగించందంటే.. ఏకంగా జాదవ్‌కు ఉరిశిక్ష కూడా విధించింది. అయితే భారత్ అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. జాదవ్‌ను విడుదల చేయకుండా పాక్ ముప్పతిప్పలు పెడుతోంది. అలాంటి దుర్మార్గపు దేశం.. వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్‌ను అంత ఈజీగా వదులుతుందా? అనే అనుమనాలూ లేకపోలేదు. అదే జరిగితే… పాక్‌పై దండయాత్ర చేసి అయినా.. మన హీరోని విడిపించుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags : imran khanIndiaindia pakistan warmodipakistanpakistan held pilotPILOTwing commander vikram abhinandan

Also read

Use Facebook to Comment on this Post



Menu