12/4/18 7:51 PM

కేసీఆర్‌కు షాక్.. తెలంగాణలో గెలిచేది ఎవరో చెప్పిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు

In Telangana, A 2 Per Cent Swing Could Be Key

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. ముందస్తు ఎన్నికలు జరిగితే విజయం తమదే అని కేసీఆర్ ధీమా. అందుకే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. మరోవైపు టీఆర్ఎస్‌ను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి కలిసి ప్రజాకూటమిగా ఏర్పాడ్డాయి. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు చేతులు కలిపాయి. కాగా గెలుపుపై ఎవరికి వారు ధీమా ఉన్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అందరికన్నా భిన్నంగా వెలువరించిన సర్వే ఫలితాలు టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయి. అదే సమయంలో ప్రజాకూటమిలో ఆనందం నింపాయి.

 

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ వెలువరించిన సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 శాతం ఓట్లు అటూ, ఇటూ మారడం వల్ల గెలుపోటములు ప్రభావితం కానున్నాయని రాయ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించిన ఆయన అధికారంలోని టీఆర్ఎస్, జట్టుకట్టిన టీడీపీ – కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండనుందని అంచనా వేశారు.

 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 33 శాతం, కాంగ్రెస్‌కు 24 శాతం, టీడీపీకి 14 శాతం, బీజేపీకి 7 శాతం, వైసీపీకి 3 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, గత ఎన్నికల్లో ఎవరికి ఓటేసిన వారు, ఇప్పుడు కూడా వారికే ఓటు వేస్తే, కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని చెప్పారు. గత ఎన్నికల్లో మూడు పెద్ద పార్టీలు ఓట్లను చీల్చుకోవడం వల్ల టీఆర్ఎస్ సులువుగా అధికారాన్ని పొందిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం గులాబీ శ్రేణుల్లో ఆందోళనను పెంచే అంశమేనని ప్రణయ్ రాయ్ విశ్లేషించారు.

 

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వచ్చిన 33 శాతం ఓట్లతో 63 సీట్లు గెలుచుకుందని.. కాంగ్రెస్, సీపీఐ కూటమి 25 శాతం ఓట్లతో 22 సీట్లను, టీడీపీ, బీజేపీ కూటమి 21 శాతం ఓట్లతో 20 సీట్లను గెలుచుకున్నాయని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన 38 శాతం ఓట్లు కొనసాగితే అధికారం ప్రజా కూటమిదేనని ఆయన అంచనా వేశారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వచ్చిన టీడీపీ-కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మొగ్గినా, ఆ పార్టీకి 36 శాతానికి మించి ఓట్లు రావని, ఈ రెండు శాతం ఓట్ల తేడా అధికారాన్ని మార్చేస్తుందని ప్రణయ్ రాయ్ అన్నారు.

 

రాష్ట్ర జనాభాలో 40 నుంచి 45 శాతం వరకూ ఉన్న ఓబీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషించిన ప్రణయ్ రాయ్, వారి ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని పార్టీలూ భారీ ఎత్తున వరాల జల్లు కురిపించాయని చెప్పారు. ఇదే సమయంలో పట్టణ ప్రాంత ఓటర్లూ అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఇక, ఆందోల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే గత 30 ఏళ్లుగా తెలంగాణలో అధికారాన్ని చేపడుతోందన్న ఆసక్తికర విషయాన్నీ ప్రణయ్ రాయ్ గుర్తు చేశారు. దీంతో పాటు గడచిన 11 ఏళ్లలో (మూడు ఎన్నికలు) మంధని, బోధన్, నరసాపూర్, వరంగల్ ఈస్ట్, జనగామ, షాద్‌నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారాన్ని పొందాయని పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు వెలువడిన సర్వేలతో టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాయి. 94 నుంచి 104 స్థానాలు వస్తాయని కేసీఆర్ సహా అంతా గట్టిగా నమ్ముతున్నారు. ఈ తరుణంలో ప్రణయ్ రాయ్ చేసిన విశ్లేషణ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగించే అంశమే. ప్రణయ్ రాయ్ విశ్లేషణ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో డిసెంబర్ 11న తేలిపోనుంది.

Tags : A 2 Per Cent Swing Could Be Key: Prannoy Roy’s AnalysisALLIANCEKCRprannoyroyanalysistelangana assembly electionstrsvote sharing In Telanganavoting

Also read

Use Facebook to Comment on this PostMenu