10/22/19 1:08 PM

పాకిస్తాన్ కాసుకో.. భారత్ నెక్ట్స్ టార్గెట్ పీఓకే

India Next Target POK

పాకిస్తాన్.. భారత దేశానికి పట్టిన ఓ పీడ. పక్కనే ఉంటూ గోతులు తవ్వుతోంది. భారత్ ఎదుగుదలను ఓర్వలేక రగిలిపోతోంది. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తూనే ఉంది పాపిస్తాన్. ఉగ్రవాదులను తయారు చేయడం వారిని మనపైకి ఉసిగొల్పడం.. ఇదే పాక్ పని. ఎన్నో ఏళ్లుగా సరిహద్దుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు పాక్ ఉగ్రవాదులు. మన జవాన్లను, పౌరులను పొట్టనపెట్టుకుంటున్నారు. అయితే ఇక ముందు అలా జరగదు. పాకిస్తాన్ పని పట్టేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ కి మన సత్తా ఏంటో చూపిన ఆర్మీ.. ఇప్పుడు మరోసారి దాడులకు రెడీ అయ్యింది.

 

అవును.. భారత సైన్యం గర్జించింది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యింది. తంగ్ధర్ సెక్టార్ లో దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాయాదాని చావు దెబ్బతీసింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దూకుడు పెంచిన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు పాక్ కి కౌంటర్ అటాక్ ఇస్తోంది. చూస్తుంటే.. పాక్ విషయంలో భారత సహనం చచ్చిపోయిందా? ఇక మిగిలింది సమరమేనా? దాయాది ఉగ్ర క్యాంపులపై మెరుపు దాడులే దానికి నిదర్శనమా? పీఓకే లక్ష్యంగా భారత ఆర్మీ అడుగులేస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

 

కయ్యానికి కాలు దువ్వే దేశం దగ్గర శాంతిమంత్రం జపిస్తే లాభం ఉండదు. ఉగ్రవాదుల మోచేతి నీళ్లు తాగే దాయాది రెచ్చగొడుతున్నా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. కౌంటర్ కి కౌంటర్ పడాల్సిందే. ఎన్ కౌంటర్ చేయాల్సిందే. పాక్ పీచం అణాచాల్సిందే. అచ్చంగా భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ గుర్తు తెచ్చేలా మరోసారి పాక్ ని కోలుకోలేని దెబ్బ తీసింది భారత ఆర్మీ. మెరుపు దాడులతో పీవోకేలో ప్రకపంనలు సృష్టించింది.

 

సరిహద్దుల్లో ఇద్దరు జవాన్లను, ఒక పౌరున్ని చంపిన పాక్ కి భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. పీవోకేలో ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు చేసింది. 15మంది ఉగ్రవాదులతో పాటు, అయిదారుగురు పాక్ సైనికులను కూడా హతమార్చడమే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్టింది. ఇక భారత్ కన్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదనే ఉంది. దాని తర్వాత పాక్ నుంచి బెలూచిస్తాన్ ను విడిపించడం టార్గెట్. ఆ విధంగా పాక్ ని మరిన్ని ముక్కలు చేయడం ద్వారా అసలు పాకిస్తాన్ రూపురేఖలు లేకుండా చేసేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. పాక్ కి మూడిందని చెప్పడానికే మెరుపు దాడులు ఓ శాంపిల్.

 

బోర్డర్ లో ఓవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరో వైపు సమయం చూపి ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేలా చేస్తూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. ఇప్పటికే ఈ కుట్రలను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ.. ఆక్రమిత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర శిబిరాలు వెలిసాయని.. దాడులు తప్పవని హెచ్చరిస్తూ వచ్చింది. ఇక, కుప్వారా జిల్లా తంగ్ధర్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన కాల్పులుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు విడవగా.. ప్రతీకార దాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ.. పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది.

 

కుప్వారా తంగ్ధర్ సెక్టార్ ఎదురుగా ఉన్న నీలం లోయలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఫిరంగి దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఇక ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాక్ సైనికులు హతమయ్యారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలపై దాడులు చేయగా.. వీటిలో మూడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో స్థావరం స్వల్పంగా దెబ్బతింది.

 

పాక్ కవ్వింపు చర్యలకు భారత్ చెక్ పెట్టింది. తరచూ సరిహద్దులో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాక్‌కు ఆదివారం భారత ఆర్మీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడస్తూ.. కుప్వారా జిల్లాలోని తంగ్ధర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో భారత ఆర్మీ.. పాక్ కి చుక్కలు చూపించింది. ఆర్టిలరీ గన్స్‌ను ఉపయోగించి.. ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలమ్ వ్యాలీలోని నాలుగు ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ భారత ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది.

 

ఓ వైపు కాల్పులు జరుపుతూ.. మరోవైపు నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేలా చేస్తుండటాన్ని భారత ఆర్మీ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. భారత సైన్యం కాల్పుల్లో పాక్ కు భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. మరిన్ని దురాఘతాలకు పాల్పడుతోంది. దీంతో భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది.

 

మొత్తంగా పాక్ విషయంలో ఇంతకముందు ఒక్క లెక్క ఇప్పుడో లెక్క. పాక్ తో చర్చలంటూ జరిగితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అనే ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు స్పష్టం చేశారు. చెప్పడమే కాదు.. అటాక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు యుద్ధం అంటూ వస్తే విజయం మనదే అని భారత ఆర్మీ చీఫ్ అంటన్నారు. పీవోకే విషయంలో మోడీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. పాక్ చేతుల్లో చిక్కుకున్న భూభాగాన్ని తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై అటాక్స్ మన ఆర్మీ సత్తాన్ని, టార్గెట్ ని తెలియజేస్తున్నాయి. ఆదివారం భారత ఆర్మీ జరిపిన మెరుపు దాడులు, బోర్డర్ లో నెలకొన్న పరిణామాలు చూస్తుంటే.. పీవోకే లక్ష్యంగా దిశగా భారత్ అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. చర్చలు అంటూ జరిగితే పీవోకే మీదే అంటూ రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు.. యుద్ధం ఎప్పుడు వచ్చినా.. సిద్ధమే అంటూ భారత ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్ చూస్తుంటే.. యుద్ధం ఖాయమని.. పీవోకేలో ప్రకంపనలు ఖాయమని అర్థమవుతోంది.

Tags : AttacksIndiaIndian ArmymodipakistanPoKSurgical Strikes

Also read

Use Facebook to Comment on this PostMenu