11/9/18 10:04 AM

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరో తేల్చేసిన సర్వే..!

TRS Win Again

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు? కాబోయే సీఎం ఎవరు? ఇప్పుడివే తెలంగాణలో మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. మళ్లీ అధికారంలో వస్తామని టీఆర్ఎస్ విశ్వాసంగా ఉంటే, మహాకూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్, టీడీపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి.

 

ఇండియా టుడే వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణలో కేసీఆరే మరోసారి సీఎం అయ్యేందుకు 75శాతం అవకాశం ఉన్నట్టు తేలింది. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించడం ఖాయమని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44శాతం మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34శాతం మంది కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22శాతం మంది ఉన్నారు.

 

తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 46శాతం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25శాతం, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16శాతం, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7శాతం, అసదుద్దీన్‌ ఓవైసీకి 4శాతం మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్‌ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది.

 

ఇక జాతీయ స్థాయి విషయానికి వస్తే.. రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలో తేలిసింది. అటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ తప్పదని వెల్లడైంది.

Tags : india today surveykcr cmtelangana electionstelangana mahakutamitrs win

Also read

Use Facebook to Comment on this Post



Menu