05/17/18 8:14 PM

యడ్యూరప్ప దెబ్బకు తమ ఎమ్మెల్యేలను బోర్డర్ దాటించేస్తున్న కాంగ్రెస్, జేడీ(ఎస్)

Untitled-1 copy

కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బలనిరూపణలో గెలిచి సీఎం సీటును పదిలపరుచుకోవాలని యడ్యూరప్ప భావిస్తుండగా.. ఆయనకు మెజార్టీ దక్కకుండా చేసి.. సీఎం కుర్చీ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే దింపాలని కాంగ్రెస్  జేడీ(ఎస్‌)లు కంకణం కట్టుకున్నాయి. దీంతో, ఇరు పక్షాలు వ్యూహా ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నాయి.

 

ఈ నేపథ్యంలోనే, కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప కీలక మార్పులు తీసుకుంటూ వైరి పక్షానికి షాక్ ఇస్తున్నారు. సీఎం పదవి చేపట్టిన వెంటనే  రామనగర జిల్లా ఎస్పీని ఆయన బదిలీ చేశారు. తదనంతరం, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్లు, రిసార్టుల వద్ద పోలీసు బందోబస్తును తొలగించారు. దీంతో మైసూరు రోడ్డులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుడు శివకుమార్‌కు చెందిన ఈగట్‌టన్‌ రిసార్ట్‌ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రక్షణగా ఉండేందుకు స్థానిక కార్యకర్తలు ముందుకు వచ్చారు.

 

మరో వైపు, ఒక్కసారిగా తమ ఎమ్మెల్యేలకు పోలీసు రక్షణ తొలగించడంపై కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) నేతలు అప్రమత్తమయ్యారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో తమ ఎమ్మెల్యేలు ఉండటం  ఏమాత్రం సేఫ్ కాదని.. ఇక్కడే ఉంటే యడ్యూరప్ప ఉచ్చులో ఎవరైనా పడవచ్చనే ఆందోళనలో ఈ రెండు పార్టీల అగ్రనాయకులు పడ్డారు. దీంతో, వీరు తమ పార్టీల ఎమ్మెల్యేలను వేరే ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ లేదా వైజాగ్‌కు.. జెడీ(ఎస్‌) ఎమ్మెల్యేలను కొచ్చి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Tags : BJPCONGRESSjdskarantaka cmkarnataka politicsKumaraswamyPower strugglesiddaramaiahyeddyurappayedurappa

Also read

Use Facebook to Comment on this Post



Menu