05/5/19 11:48 AM

జనసేన వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? పవన్ కళ్యాణ్‌కి గుడ్ న్యూస్

Janasena Impact Was More Than Expected

ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ, వైసీపీతో పోలిస్తే జనసేన సైలెంట్ అయ్యింది. పోలింగ్ ముగిశాక పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై టీడీపీ, వైసీపీ నాయకులు స్పందించారు. పోలింగ్ శాతం పెరిగిందని, తమకే అనుకూలమని, విజయం తమదే అని టీడీపీ, వైసీపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. పోలింగ్ తర్వాత చాలా రోజులు జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపించలేదు. మీడియాకే కాదు.. కనీసం పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో లేరు. దీనికి కారణం ఏపీ ఎన్నికల్లో జనసేనకు పెద్దగా ఆదరణ లభించకపోవడమే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనసేన వర్గాలు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా..టీడీపీ గెలుస్తుంది లేదా వైసీపీ గెలుస్తుందని అని అనే వారే కానీ.. జనసేన గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో డైరెక్ట్ గా పోటీచేసిన జనసేకు చేదు అనుభవం తప్పదని అంతా అనుకుంటున్నారు. జనసేన వర్గాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. దీంతో వారిలో ఒక రకమైన నిరాశ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో ఉత్సాహం నింపాయి. జనసేన సత్తా ఏంతో తెలియజెప్పాయి.

 

అంతా అనుకుంటున్నట్టు జనసేన వీక్ అవ్వలేదని, రెండు జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, ఆ రెండు జిల్లాల్లో జనసేనదే హవా అని స్వయంగా టీడీపీ నేత చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జనసేన ప్రభావం గట్టిగా ఉందని టీడీపీ అభ్యర్థి, మురళీమోహన్ కోడలు మాగంటి రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోదగ్గ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని రూప తెలిపారు. ఎన్నికల సమీక్షలో భాగంగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజక వర్గంపై సీఎం చంద్రబాబు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో మాగంటి రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పోటీ ఇచ్చిందని అన్నారు.

 

ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితులయ్యారని, ఒక వర్గం ఓట్లు జనసేనకు గంపగుత్తగా పడ్డాయని రూప విశ్లేషించారు. మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన చాలా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. అయితే రాజమండ్రి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని రూప తెలిపారు. పోలింగ్ కూడా భారీగా నమోదు కావడంతో ప్రభుత్వంపై ప్రజల సానుకూలత ఓటు పడిందని రూప తెలిపారు. జనసేన కారణంగా ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు. గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ నమోదు కాలేదని, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామని ఆమె చెప్పారు.

 

మాగంటి రూప చేసిన వ్యాఖ్యలే జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదని, రెండు మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనే వార్తలు జనసైనికుల్లో నిరుత్సాహం నింపాయి. అందుకు భిన్నంగా మాగంటి రూప చేసిన వ్యాఖ్యలు జనసేనకు బూస్టింగ్ ఇచ్చాయనే చెప్పారు. మొత్తంగా జనసేన ప్రభావం ఏ మేరకు ఉంది, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది తెలియాలంటే.. మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : ap electionschandrababueast godavarijanasenajanasena impactmaganti rupapawan kalyanTDPwest godavari

Also read

Use Facebook to Comment on this PostMenu