02/21/18 9:45 PM

ఊహాగానాలకు తెరదించిన విలక్షణ నటుడు..!

Untitled-1 copy

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ అరంగ్రేటం చేశారు. తన కొత్త పార్టీ పేరును గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ పేరును కమల్ ప్రకటించారు. ‘మక్కల్ నీతి మయ్యమ్’ (పీపుల్స్ జస్టిస్ పార్టీ) అని పార్టీకి నామకరణం చేశారు. పార్టీ లోగోను కూడా కమల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.

 

‘నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాయకుడిగా భావించడం లేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒకడిని. ప్రజా సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నా. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటా’ అని కమల్ వ్యాఖ్యానించారు.

 

‘కొత్తగా స్థాపించిన మక్కల్ నీతి మయ్యం మీ పార్టీ. ఎప్పటినుంచో మనం కోరుకుంటున్న మార్పును తెచ్చేందుకు ఇది ఆవిర్భవించింది. మీకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి’ అంటూ పార్టీ ఏర్పాటుపై కమల్ తొలి ట్వీట్ చేశారు. అంతకుముందు కమల్‌ రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కుటుంబ సభ్యులను కలుసుకుని అక్కడి కలాం సమాధి వద్ద నివాళి అర్పించారు.

Tags : Kamal Haasanmakkal needhi maiamnew partyNew Political Partypolitical ideologyrajinikanthtamilandu

Also read

Use Facebook to Comment on this Post



Menu