08/10/18 7:19 PM

బాబుగారూ.. మరీ ఇంత విలాసామా? నివ్వెరపోతున్న కర్ణాటక ప్రజలు

Untitled-1 copy

సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రం పర్యటన తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేసింది. సీఎం చంద్రబాబుపై విమర్శలకు తావిచ్చింది. బాబుగారు.. మరీ ఇంత విలాసామా? అని ఆ ఊరి జనాలు నివ్వెరపోతున్నారు.

 

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు, జాతీయ నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో బెంగళూరులో వీరి బస, ఇతర ఏర్పాట్ల కోసం తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌ తో పాటు మరో స్టార్ హోటల్‌ ను బుక్ చేశారు. అతిథుల బసకు కర్ణాటక ప్రభుత్వం ఖజానా నుంచి భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. ఒక్కో నేత కోసం కనిష్టంగా లక్ష రూపాయల మొత్తం నుంచి గరిష్టంగా 8.7 లక్షల రూపాయల మొత్తం వరకూ వెచ్చించింది కర్ణాటక ప్రభుత్వం. మొత్తంగా.. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అతిథి మర్యాదలకే రూ.42 లక్షలు ఖర్చు కావడం పట్ల విస్తుపోతున్నారు.

 

ప్రమాణస్వీకారోత్సవానికి అయిన ఖర్చుపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించి ‘బెంగళూరు మిర్రర్’ ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. నేతల అతిథి మర్యాదల కోసం కర్ణాటక ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించడం కన్నడ నెటిజన్లలో చర్చకు దారి తీసింది. వీళ్లందరూ బెంగళూరులో గడిపింది కొన్ని గంటలే అయినా.. వీరి అతిథి మర్యాదల బిల్లులు మాత్రం తడిసిమోపెడయ్యాయి. ప్రభుత్వ సొమ్ముతో నేతల విలాసాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.1.85లక్షలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ.1.02 లక్షలు, మాయావతి రూ.1.41 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.1.02 లక్షలు, కమల్ హాసన్‌ రూ.1.02 లక్షలు, శరద్ పవార్ కు రూ.64 వేలు  ఖర్చయిందని ప్రభుత్వం తెలిపింది.

 

అందరిది ఒక ఎత్తైతే.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిల్లు మాత్రం అదిరిపోయింది. అందరికంటే చంద్రబాబు ఖర్చే తడిసి మోపెడయ్యిందట కుమారస్వామికి. మే 23న (9.49am) బెంగళూరు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరునాడు మే 24 న(05.34am) హోటల్ ఖాళీ చేశారు. 18గంటల పాటు ఆయన అక్కడ ఉన్నారు. ఇందుకు అయిన ఖర్చు అక్షరాల 8.7 లక్షల రూపాయలట. మిగిలిన నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఖర్చు ఒక్కొక్కరి మీద లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ఉండగా.. చంద్రబాబు ఖర్చు మాత్రం ఏకంగా 8.7 లక్షల రూపాయలుగా నమోదవ్వడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. బాబుగారు.. మరీ ఇంత విలాసమా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 

కొన్ని గంటల కోసమే వీళ్ల అతిథి మర్యాదల ఖర్చు ఈ స్థాయిలో ఉండటంతో నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతగా వీరికి అతిథి మర్యాదలు చేయాలనుకుంటే జేడీఎస్ పార్టీ తమ సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేసుకోవాల్సిందని, ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో ఇలా విలాసాలకు పోవడం ఏమిటి? అని మండిపడుతున్నారు.

Tags : Andhra cm chandrababu naiduBangalore mirrorexpenditurekumaraswamy swearing inpublic moneytaj west end

Also read

Use Facebook to Comment on this Post



Menu