01/21/18 7:34 PM

కత్తి మహేష్ రాజీ పడటానికి కారణం అతడేనా?

Untitled-1 copy

కొన్ని నెలలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి, సినీ క్రిటిక్ కత్తి మహేష్ కి మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానుల మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసును కత్తి మహేష్ వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఉదయం కేసు పెట్టిన కత్తి మహేష్.. సాయంత్రానికి కేసుని విత్ డ్రా చేసుకోవడం విశేషం. అయితే కత్తి హేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య రాజీ కుదరడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.

 

జనసేన పార్టీలో నేతగా చెబుతున్న సుంకర కల్యాణ్ అనే వ్యక్తి ఈ రాజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. పవన్ సోదరుడు నాగబాబుకు దూతగా సుంకర కల్యాణ్ మధ్యవర్తిత్వం వహించాడని సమాచారం. వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని నాగబాబు భావించారని, ఆయన సలహాతోనే సుంకర కల్యాణ్ రంగంలోకి దిగాడని చెబుతున్నారు. అదీగాక పవన్ అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని జనసేన తన ప్రకటనలో కోరిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మహేష్ కూడా పరిస్థితి మరీ ముదరకముందే ఇక ఈ వివాదానికి స్వస్తి పలకాలని భావించినట్టు సమాచారం.

 

కార్యకర్తలు, పవన్ అభిమానులు సంయమనం పాటించాలని కోరుతూ జనసేన లేఖ ద్వారా కోరిన విషయమై కత్తి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్, జనసేన సరైన మార్గంలోకి వచ్చాయన్నాడు. నాపై దాడిని ఖండించడం, క్షమాపణలు చెప్పడం పవన్ కే వదిలేస్తున్నాని తెలిపాడు. పవన్‌, జనసేనను విమర్శించడం మాత్రం ఆపబోనని కత్తి స్పష్టం చేశాడు. ఇక తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం కాని, కక్ష కాని లేదని కత్తి మహేష్ పేర్కొన్నాడు. పరిణతి సాధించకుండా, పవన్ అంటే పిచ్చి అభిమానంతోనే వారు తనపై దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డాడు. శిక్షించడం కంటే, వారిలో మార్పు తీసుకురావడం తన నైతిక బాధ్యత అని కత్తి మహేష్ తెలిపాడు. పవన్‌ లా కాకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

Tags : Jana sena partyKathi Maheshnagababupawan kalyanpawan kalyan fanssunakara kalyanwar endswith draws complaint

Also read

Use Facebook to Comment on this Post



Menu