04/9/19 10:17 PM

చంద్రబాబుని ఊహించని దెబ్బకొట్టిన కేసీఆర్

kcr strong counter for chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు.. నోరు విప్పితే చాలు.. జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. బాబు ఎన్నికల ప్రచారం మొత్తం జగన్ ను విమర్శిస్తూనే సాగింది. కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ కు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. అంతేకాదు.. ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని.. అలాంటి వ్యక్తితో జగన్ చేతులు కలిపారని.. చంద్రబాబు పదే పదే విమర్శలు చేశారు.

 

చంద్రబాబు ఆరోపణలు తెలంగాణ సీఎం కేసీఆర్ చెవినపడ్డాయో, లేక తన ఫ్రెండ్ జగన్ ని చంద్రబాబు టార్గెట్ చెయ్యడం కోపం తెప్పించిందో తెలియదు కానీ.. అనూహ్యంగా కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తన పేరు చెప్పుకుని జగన్ ను టార్గెట్ చేసే అవకాశం లేకుండా చేశారు..

 

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అడ్డు పడలేదని అన్నారు. వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి రాజకీయ నేతలతో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకెలాంటి గొడవా లేదన్నారు. ఈసారి డిపాజిట్లు రాకుండా టీడీపీ ఓడిపోబోతున్నదని కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు కహానీ ఖతమైపోయిందని, అందుకే బాబు పరిస్థితి బాగోలేదని, దీంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, శాపాలు పెడుతున్నారని కేసీఆర్ అన్నారు.

 

నా దగ్గర సర్వే రిపోర్టు ఉందని కేసీఆర్ చెపపారు. చంద్రబాబులా చీకటి పనులు మేం చేయము అన్నారు. చంద్రబాబు లాంటి కుట్రలు మాకు రావన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కుండబద్ధలు కొట్టి చెబుతున్నా అని కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు మా ఎంపీలు లోక్‌సభలో చెప్పారని, . నేను కూడా చెప్పాను అని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మాకున్న సమాచారం ప్రకారం, తెలంగాణలో మేము 16 ఎంపీ స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తామని కేసీఆర్ చెప్పారు. ఏపీలో జగన్ కూడా బ్రహ్మాండంగా గెలుస్తారని అన్నారు. టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి 35, 36 ఎంపీలు అవుతారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవడానికి మా ఎంపీలు మద్దతు ఇస్తారు అని కేసీఆర్ చెప్పారు.

 

మేము పోలవరం ప్రాజెక్టుకు ఎన్నడూ అడ్డుకోలేదుని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఎందుకంటే, గోదావరిలో నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, ఈ ఏడాది కూడా 2,600 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని, అలా వృథాగా పోయే నీటిని మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పారు. నదీ జలాల్లో మా వాటా మాకు రావాల్సిందే అన్నారు. మా పొలాలు పారాలి అన్న కేసీఆర్… మాతో పాటు, మీరు కూడా బతకాలని కోరుతున్నాం అన్నారు. మీలాగా రాజకీయాల కోసం అబద్ధాలు ఆడేవాళ్లం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు.

 

ఎన్నికల వేళ జగన్ ను టార్గెట్ చేసి లబ్ది పొందాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఆంధ్రులను తిట్టిన, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కి అడ్డుపడుతున్న కేసీఆర్ తో జగన్ దోస్తీ చేస్తున్నాడని చెప్పి ఏపీ ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తీసుకురావాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే సడెన్ గా కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు మేము మద్దతిస్తామని ప్రకటించారు. అంతేకాదు చాలా తెలివిగా మాట్లాడారు.. చంద్రబాబు లాంటి నాయకులతో తప్ప ఏపీ ప్రజలకు తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. మొత్తంగా జగన్ ను సేఫ్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని జగన్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మ్యాటర్ ను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Tags : ap special statuschandrababuKCRpolavaramys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu