08/27/19 12:48 PM

ఈయన కానీ దేశ ప్రధాని అయి ఉంటే.. ఇంటికి ఏం పట్టుకెళ్లేవారో

Kodela Siva Prasad Makes Chandrababu Shameful

కోడెల శివప్రసాదరావు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. కోడెల చేసిన పనికి అంతా నవ్వుకుంటున్నారు. కోడెల కక్కుర్తి కారణంగా చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ పరువు గంగలో కలిసింది. కోడెల మరీ ఇంత కక్కుర్తి మనిషా అని షాక్ అవుతున్నారు. ఛీ…ఛీ.. అని అసహ్యించుకుంటున్నారు. ఇంతకీ కోడెల ఏం చేశారో తెలుసా? ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్ నే ఇంటికి ఎత్తుకెళ్లారు. సొంతానికి వాడుకున్నారు. అంతేనా కొడుక్కి చెందిన షోరూమ్ లో ఫర్నీచర్ ని వినియోగించారు. కస్టమర్ల కోసం డెకరేట్ చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన సమయంలో కోడెల చేసిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని కోడెల సొంతానికి వాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరీ ఇంత కక్కుర్తా అని అంతా తిట్టుకుంటున్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవికే మాయని మచ్చ తెచ్చారని మండిపడుతున్నారు.

 

ఏదో గల్లీ స్థాయి లీడర్ ఈ పని చేసి ఉంటే.. పోనీలే అని సరిపెట్టుకుని ఉండేవారు. కానీ రాజకీయాల్లో సీనియర్. పైగా ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచారు. ఆపై అసెంబ్లీ స్పీకర్. ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంచి చీప్ పని చెయ్యడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వస్తువులను ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా.. పైగా.. ఏదో ఉద్దరించినట్టుగా చెప్పుకోవడం కోడెలకే చెల్లింది.

 

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తీరు సిగ్గు చేటు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ ప్రజల ఆస్తి అని, వాటిని తన ఇంటికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెప్పడం కామెడీగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విచారణలో తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని నిలదీశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లి నరసరావుపేటకే కోడెల శివప్రసాదరావు మచ్చ తెచ్చారన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి పని చేశారంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉమెన్స్‌ పార్లమెంట్‌ సమావేశంలో కోడెల మాట్లాడుతూ..కార్‌ షెడ్డులో ఉండాలి..ఆడవాళ్లు వంటింట్లో ఉండాలని వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ఫర్నీచర్‌ అసెంబ్లీలో ఉండాలా? కోడెల ఇంట్లో ఉండాలా? అని ప్రశ్నించారు.

 

అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మెడిసిన్స్‌.. కోడెల కూతురు మెడికల్‌ షాపుల్లో పెట్టి అమ్ముకున్నారని ఆరోపించారు. పబ్లిక్‌ ప్రాపర్టీని తన ఇంట్లో, కొడుక్కి చెందిన హీరో హోండా షోరూమ్‌లో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి నేతను టీడీపీలో ఎలా కొనసాగిస్తారని వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. కోడెల మరీ అంత కక్కుర్తి కాండిడేటా అని షాక్ అవుతున్నారు.

 

హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ తరలించిన సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ని ఎవరికి చెప్పకుండా గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంప్ కార్యాలయాలకు కోడెల తరలించారని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను ఫర్నీచర్ ను తీసుకెళ్లిన మాట నిజమేనని కోడెల అంగీకరించారు. హైదరాబాద్ అసెంబ్లీలో ఫర్నీచర్ కు భద్రత లేదని అందుకే వాటిని తన ఇంటికి పట్టుకెళ్లానని కోడెల వివరణ ఇవ్వడం విడ్డూరం. ఎన్నికల తర్వాత ఆ ఫర్నీచర్ ని తీసుకెళ్లాలని అధికారులకు చెప్పానని కోడెల చెప్పుకొచ్చారు. ఫర్నీచర్, కంప్యూటర్ల కు ఎంత విలువ అవుతుందో లెక్క చెబితే దానిని చెల్లిస్తానని కూడా చెప్పడం విశేషం. నీచమైన పని చేయడమే కాకుండా దాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకోవడం కోడెలకే సొంతమైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కోడెల మరీ అంత కక్కుర్తి కాండిడేటా? అని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆ సామాగ్రి కోడెల వశమై ఉండేదని అంటున్నారు.

 

గుంటూరులోని కోడెల కొడుకు గౌతమ్‌ కి చెందిన హీరో షోరూమ్‌లో రూ.కోట్ల విలువ చేసే అసెంబ్లీ ఫర్నీచర్‌ ని అసెంబ్లీ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను తీసుకెళ్లడమే కాకుండా వాటిని సొంతానికి వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా చాలదన్నట్టు.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని కోడెల్ హల్ చల్ చేశారు. దొంగలు రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. అది కూడా సీపీయూలు మాత్రమే తీసుకెళ్లారని కోడెల చెప్పారు. తన ఇంట్లో దొంగలు పడ్డారని కోడెల చెప్పడం హాస్యాస్పదమైంది. కోడెల ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన మనుషులు నిత్యం కాపలా కాస్తుంటారు. అలాంటి వ్యక్తి ఇంట్లో చోరీ జరగడం అంటే మేము నమ్మాలా అని వైసీపీ నేతలు అంటున్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి కోడెల మరో నాటకానికి తెరతీశారని విమర్శలు వచ్చాయి.

 

మొత్తంగా కోడెల తన పరువుని తానే తీసుకున్నారు. గంగలో కలుపుకున్నారు. అంతేకాదు చంద్రబాబు, టీడీపీ పరువు కూడా గంగలో కలిపేశారు. ఇంతజరుగుతున్నా చంద్రబాబు నోరు విప్పడం లేదు. కోడెల పనిని ఖండించడం లేదు. దీంతో చంద్రబాబుపైనా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తిని ఇంకా టీడీపీలో ఉంచుకోవడం చంద్రబాబుకే చెల్లిందని అంటున్నారు. టీడీపీ ఓటమి తర్వాత కోడెల శివప్రసాదరావు అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఎంత ఫ్రాడ్ అన్నది బయటపడింది. కోడెల ట్యాక్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమాయకులను బెదిరించి ఏ విధంగా డబ్బు వసూలు చేశారో బయటపడింది. కోడెల ట్యాక్స్ బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతున్నారు. కోడెల తీరుతో సొంత పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇదేమి కక్కుర్తి దేవుడా అని నోళ్లు వెళ్లబెట్టారు. ఛీ..ఛీ.. అని కోడెలను అస్యహించుకుంటున్నారు. మొత్తంగా వరుస వివాదాలతో కోడెల రాజకీయ జీవితానికి ఎండ్ పడినట్టే అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు.

Tags : assembly furniturechandrababucm jaganhonda show roomkodela siva prasad raosattenapallishamefulsiva rama krishnaTDP

Also read

Use Facebook to Comment on this PostMenu