02/5/19 9:06 PM

కొనసాగుతున్న చేరికలు.. జనసేనలోకి ప్రముఖ విద్యావేత్త

KV Vishnu Raju Joins Jana Sena

ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లకు తన సత్తా ఏంటో చూపించాలని కసిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు జనసేనవైపు చూస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణు రాజు జనసేన పార్టీలో చేరారు. విష్ణురాజుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.

 

భీమవరంలోని డాక్టర్ బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ విష్ణురాజుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని పవన్ చెప్పారు. ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందని అన్నారు. పాలసీ మేకింగ్, పార్టీకి దిశానిర్దేశం విషయంలో తన పాత్ర ఉంటుందని విష్ణురాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. అంతేకాదు ఆయనకు పవన్ కీలక పదవి అప్పగించారు. జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ పదవిని విష్ణుకి కట్టబెట్టారు.

 

సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో తాను ఉన్నానని.. అందుకు తనకు జనసేన చక్కని మార్గంగా కనిపించిందని విష్ణురాజు చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను రెండు మూడుసార్లు కలిశాను అన్న ఆయన.. పవన్ పాలసీ, ఫిలాసపీ తనకు బాగా నచ్చాయన్నారు. రాష్ట్రం కోరుకుంటే మంచి మార్పు తీసుకొచ్చేందుకు జనసేనాని సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్, జనసేన టీంకు తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. పార్టీ అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.

Tags : Bhimavaramcm chandrababuKV Vishnu Raju Joins Jana Senapawan kalyanPopular academician KV Vishnu Rajuys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu