12/5/18 10:34 PM

చంద్రబాబును వదులుకుంటే నష్టపోతారని ఆ రోజే చెప్పా..!

Lagadapati Rajagopal Sensational Survey

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కించారు. ప్రస్తుతానికి ప్రజాకూటమిదే హవా అని లగడపాటి చెప్పడం.. లగడపాటి సర్వే వెనుక కుట్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం తెలిసిందే. చంద్రబాబు ఒత్తిడి మేరకే లగడపాటి సర్వే ఫలితాలను మార్చి చెప్పారని.. నవంబర్ 20న లగడపాటితో జరిగిన వాట్సాప్ సంభాషణను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. తనపై ఆరోపణలు రావడంతో లగడపాటి స్పందించారు. ఈసారి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు.

 

టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో గెలుస్తుందని కేటీఆర్‌కు తాను ఇచ్చిన సర్వే వివరాలు నిజమేనని లగడపాటి అంగీకరించారు. అయితే ఆ సర్వే ఇప్పటిది కాదని, మహాకూటమి ఏర్పడకముందుది అని లగడపాటి వివరించారు. కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐ మహాకూటమిగా ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోయానని లగడపాటి తెలిపారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను లగడపాటి ఖండించారు. తాను ఎవరి ఒత్తిడితోనూ సర్వే ఫలితాలు మార్చలేదని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపితే ఫలితాలు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వీలైతే అభ్యర్థులను కూడా మార్చాలని ఆ రోజే కేటీఆర్‌కు సూచించినట్లు చెప్పారు. ఓటు బదిలీపై కూడా కేటీఆర్‌తో తాను చర్చించినట్లు చెప్పిన లగడపాటి… ఓ 37 నియోజకవర్గాలు కేటీఆర్ తనకు ఇచ్చి సర్వే చేయించాల్సిందిగా కోరారని చెప్పారు. ఆ 37 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉందని చెప్పానని అన్నారు. తాను నాడు చేసిన ఫలితాలు మహాకూటమి ఏర్పడక ముందు అని …. కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐ కలిశాక చేసిన సర్వేలపై ఫలితాలు తారుమారు అయ్యాయని లగడపాటి చెప్పారు. తాజాగా వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్వే ఫలితాలు వచ్చినట్లు చెప్పిన లగడపాటి… వరంగల్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నట్లు తెలిపారు.

 

అంతేకాదు అక్టోబర్‌లో తాను గజ్వేల్ వెళ్లిన సమయంలో తన కారును పోలీసులు ఆపారని లగడపాటి చెప్పారు. తనను చూసి కానిస్టేబుల్ గుర్తుపట్టారని ఆ సమయంలో నలుగురు కానిస్టేబుళ్లను గజ్వేల్‌లో ఎవరు గెలుస్తారని అడిగినప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారని అయితే కేసీఆర్ పేరును మాత్రం ప్రస్తావించేందుకు ఇష్టపడలేదని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అంతేకాదు తాను కేసీఆర్ ఓడిపోవడం అనేది జరగదని ఆ పోలీసులతో చెప్పినప్పుడు డిసెంబర్ 11న మీరు చూడండి అంటూ వారు తనతో చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. దీనిబట్టి చూస్తూ కేసీఆర్‌కు కూడా గజ్వేల్‌లో పరిస్థితి కష్టంగా ఉన్నట్లే తెలుస్తోందని అన్నారు.

 

అంతేకాదు తెలంగాణలో టీడీపీని వదులుకోవడం వల్ల టీఆర్ఎస్‌కు నష్టమని తాను ముందే కేటీఆర్‌కు వివరించినట్టు రాజగోపాల్ చెప్పారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో తన సమీప బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. ఆ సమయంలో చంద్రబాబును కలుపుకునిపోవాలని కేటీఆర్‌కు సూచించినట్టు చెప్పారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కూటమిగా ఏర్పడడం వల్ల టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీకి చెందిన 20 శాతం ఓటు బ్యాంకు టీఆర్ఎస్‌కు వెళ్లిపోయిందన్నారు. కానీ, క్రమంగా టీడీపీ ఓటు బ్యాంకు తిరిగి వస్తోందని వివరించారు. టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య సుమారు 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. అయితే సీపీఐ, టీడీపీ, టీజేఎస్ కలవడం వల్ల కూటమికి ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags : chandrababuKCRktrLagadapati rajagopalprajakutamiTDPtelangana assembly electionstrs

Also read

Use Facebook to Comment on this Post



Menu