11/14/17 9:24 PM

నిప్పులు చెరిగిన లక్ష్మీ పార్వతి..!

Untitled-1 copy

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ అంశం హాట్ టాపిక్ గా మారింది. దివంగత ఎన్టీఆర్ పై ఏకంగా మూడు బయోపిక్ లు రానుండటం వివాదానికి దారి తీసింది. మ్యాటర్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేతిరెడ్డి జగదీవ్వర్ రెడ్డి, లక్ష్మీ పార్వతిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి.

 

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను తెరకెక్కిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. దివంగత ఎన్టీఆర్ ను, తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక మహిళకు పెళ్లైన తర్వాత ఆమెపై కన్న తండ్రికి కూడా అధికారం ఉండదని… అలాంటిది తన జీవితం గురించి సినిమా తీయడానికి వీళ్లంతా ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై తాను ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

 

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన లక్ష్మీపార్వతి.. ఘాట్ వద్ద సమాధికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను, ఎన్టీఆర్‌ను అవమానించేలా, చరిత్రను వక్రీకరించి సినిమా తీయాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.

 

25 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి పేరును తన పక్కన చేర్చడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. మొదటి నుంచి తనను అడుగడుగునా అడ్డుకుంటున్న వ్యక్తులు, ఎన్టీఆర్ తో తన వివాహాన్ని కూడా అడ్డుకోవాలని చూసిన వ్యక్తులకు తన మాటలు తగులుతాయని చెప్పారు. కేతిరెడ్డిలాంటి వారి వెనకున్న ఆ శక్తులు ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు.

 

అడ్డమైన ఒక వెధవ తన పక్కన మరెవరో పేరు పెట్టి… తన భర్త సమాధి వద్దకు రావడమేంటని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. కేతిరెడ్డి వెనక ఉన్న వ్యక్తులకు ధైర్యం ఉంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తనకు ఎవరూ లేనప్పుడే వీరందరితో తాను ఒంటరిగా పోరాడానని… ఇప్పుడు తన వెనుక ప్రజలు ఉన్నారని చెప్పారు. సినిమాను తీస్తున్న వ్యక్తులకు అంత సీన్ లేదని… ఒకడేమో అప్పుల్లో ఉన్నాడని, మరొకడేమో ప్లాట్ ఫామ్ వెధవ అని… వీరికి సినిమా తీసేంత దమ్ము, ధైర్యం లేవని ఆమె అన్నారు.

 

వీరిని ముందు పెట్టి ఒక వ్యక్తి నాటకం ఆడిస్తున్నారని ఆరోపించిన లక్ష్మీ పార్వతి.. ఆ వ్యక్తి ఎవరో బయటకు వచ్చే పరిస్థితిని తాను తీసుకురాబోతున్నానని, లీగల్ గా ముందుకెళతానని చెప్పారు.

 

తన అనుమతి లేకుండానే తన జీవిత చరిత్రను ఎలా తీస్తారంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు. కేతిరెడ్డి లాంటి కొంతమంది పాపులు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించడంతో.. ఈ ప్రాంతమంతా అపవిత్రమైందని.. అందుకే పాలాభిషేకంతో శుద్ధి చేశామని ఆమె వివరించారు.

Tags : fireskethi reddy jagadishwar reddyLAKSHMI PARVATHIntr biopicram gopal varma

Also read

Use Facebook to Comment on this Post



Menu