06/11/19 8:03 PM

టీడీపీ ఓటమిపై లక్ష్మీపార్వతి ఆనందం

Lakshmiparvathi Happy With TDP Defeat

దివంగత ఎన్టీ రామారావు భార్య, వైసీపీ నేత లక్ష్మీపార్వతికి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంత కోపం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు పేరు వింటే చాలు.. లక్ష్మీపార్వతి కోపంతో ఊగిపోతారు. ఛాన్స్ చిక్కితే చాలు చంద్రబాబుని ఏకిపారేస్తారు. చంద్రబాబు నమ్మకద్రోహి అని, వెన్నుపోటుదారుడు అని ఆరోపిస్తారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత లక్ష్మీపార్వతిలో జోష్ పెరిగింది. ఆమె ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 

ఏపీలో టీడీపీ ఓటమితో తాను చాలా సంతోషంగా ఉన్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఏపీలో రాజన్న రాజ్యం కోసం, సుపరిపాలన కోసం ఐదేళ్లు కష్టపడ్డామని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులు అల్లాడిపోయారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చావేదికలో లక్ష్మీపార్వతి మాట్లాడారు.

 

చంద్రబాబు తన ఐదేళ్ల పదవీకాలంలో అబద్ధాలతో కాలక్షేపం చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, ఇచ్చిన మాట నిలుపుకునేందుకు జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు కాకపోయినా ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సహా సామాన్యులకు లబ్ధి కలిగేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. రాజన్న రాజ్యం తెస్తామన్న జగన్ తన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అన్నారు. గ్రామ సెక్రటేరియట్ల ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

Tags : ap cmchandrababudefeatLAKSHMI PARVATHITDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu