08/12/18 5:41 PM

సీఎం పదవిని వేరే కులస్తులకు ఇస్తారా?: జగన్ కు ఛాలెంజ్

Untitled-1 copy

కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోని, తాము ఏమీ చేయలేము అని.. కాపులకు రిజర్వేషన్ కు బదులుగా కాపు కార్పొరేషన్ కు రూ.10వేల కోట్లు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు నేతలకు ఆగ్రహం తెప్పించాయి. జగన్.. కాపులను మోసం చేశారని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇదివరకే మండిపడ్డారు. తాజాగా మరోసారి జగన్ పై ఫైర్ అయిన ముద్రగడ.. జగన్ కు ఓ సవాల్ కూడా విసిరారు.

 

కాపులకు రిజర్వేషన్ కు బదులుగా రూ.10వేల కోట్లు ఇస్తానని జగన్ చెప్పడం దారుణమన్న ముద్రగడ.. ‘మీరు రూ.10 వేల కోట్లు ఇవ్వడం కాదు. మేమే మీకు రూ.20,000 కోట్లు ఇస్తాం. ఇతర కులస్తుడికి సీఎం పదవి ఇస్తారా?’ అని ప్రశ్నించారు.

 

గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ.. జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌ కు రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్రలో జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని ముద్రగడ అన్నారు. కాపు రిజర్వేషన్, ఇతర డిమాండ్లను నెరవేర్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. అలాంటి పార్టీల పల్లకినే తాము మోస్తామని పేర్కొన్నారు.

Tags : kapu reservationsmudragada padmanabhammudragada padmanabham challenge to ys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu