03/14/19 12:14 PM

నారా వర్సెస్ నార్నె: లోకేష్‌ను ఓడించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్

Nara Vs Narne.. Jr NTR Father In Law To Contest From Mangalagiri

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ డైరెక్ట్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆయన పోటీ చేసే అసెంబ్లీ స్థానం కన్ఫామ్ అయ్యింది. ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చెయ్యబోతున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారు, దమ్ము లేదు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు చెక్ చెబుతూ లోకేష్ మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ 1983 నుంచి చూసుకుంటే కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. అయినా అలాంటి స్థానాన్ని ఎంచుకుని సాహసం చేసింది.

 

మంగళగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. పలు ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. టీడీపీకి గట్టి పట్టు ఉంది. పైగా రాజధాని ప్రాంతంలో కీలక ప్లేస్. ఈ క్రమంలో మంగళగిరి నుంచి అయితే లోకేష్ ఈజీగా గెలుస్తారని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని హోప్స్ పెట్టుకున్నారు. లోకేష్ ను అక్కడి నుంచి బరిలోకి దింపుతున్నారు.

 

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. లోకేష్ కు దమ్ములేదని, ఓడిపోతారనే భయంతోనే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టారని విపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా లోకేష్ రెడీ అయ్యారు. రాజధాని నడబొడ్డున.. చూసుకుందాం రండి.. అని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. లోకేష్ ను ఓడించడానికి ప్రతిపక్షనేత జగన్ స్కెచ్ లు వేస్తున్నారు. లోకేష్ ని ఓడిస్తే టీడీపీపై దాన్ని ప్రభావం మాములుగా ఉండదు. అందుకే మంగళగిరిలో గట్టి అభ్యర్థిని నిలిపే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తిని పోటీలో దింపాలని జగన్ యోచిస్తున్నారట. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లనే బరిలోకి దింపుతారా.. కొత్తగా ఎవరినైనా ప్రకటిస్తారా అనేది చూడాలి.

 

ఈ క్రమంలో అనూహ్యంగా నార్నె శ్రీనివాసరావు పేరు తెరమీదకు వచ్చింది. నార్నె జూనియర్ ఎన్టీఆర్ మామ. నార్నె కూతురుని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే నార్నె వైసీపీలో చేరారు. నార్నె పార్టీలో చేరేటప్పుడే.. ఆయనకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తుండటంతో… మంగళగిరి అయితే నార్నెకు సెట్ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే జూనియర్ ఎన్టీఆర్ మామే కరెక్ట్ అని వైసీపీ యోచిస్తోంది. ఒకవేళ వైసీపీ నుంచి నార్నె బరిలోకి దిగితే.. ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఓవైపు చంద్రబాబు ఫ్యామిలీ.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్యామిలీ ఎన్నికల్లో తలపడినట్టే. గత ఎన్నికల్లో మంగళగిరిలో టఫ్ కాంపిటిషన్ నడిచింది. టీడీపీ అభ్యర్థిపై… వైసీపీ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండటంతో.. లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే నార్నె కరెక్ట్ చాయిస్ అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 

నార్నెని పోటీలోకి దింపితే.. అల్లుడు ఎన్టీఆర్ కచ్చితంగా మామ గెలుపు కోసం ప్రచారం చేస్తాడని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మామను గెలిపించుకునేందుకు ఎన్టీఆర్ ప్రయత్నాలు చేయకపోడని ఆశలు పెట్టుకున్నారు. పైగా మంగళగిరి ప్రాంతంలో చేనేత వర్గాలకు చెందిన వారి ఓట్లు ఎక్కువ. అదే సామాజికవర్గానికి చెందిన నార్నెని.. మంగళగిరి నుంచి బరిలోకి దింపితే గెలుపు కష్టం కాదనే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. మొత్తంగా నారా లోకేష్ ఎంట్రీతో ఇప్పుడు అందరి చూపు మంగళగిరిపైనే పడింది. అక్కడ వైసీపీ నుంచి ఎవరు నిలుస్తారు అని రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

Tags : alla Ramakrishna reddyap electionschandrababuJr.NTRmangalagirinara lokeshnara narnenarne srinivas raoTDPysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu